Cyber Cheaters: ఓఎల్ఎక్స్ లో కుర్చీ అమ్మకానికి పెడితే.. లక్షలు కాజేసి కుచ్చిటోపి పెట్టాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Cheaters: టెక్నాలజీ అనేది మన రోజు వారి జీవితంలో భాగమైంది. దీని వాడకం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో.. అంతకు రెట్టింపు నష్టాలు కూడా ఉన్నాయి. ఆన్‌లైన్ మోసాలు, నేరాలు, వేధింపులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే జీవితాలు ప్రమాదంలో పడే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా ఎక్కడో ఓ చోట ఆన్ లైన్ మోసాలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఇదే తరహా మోసం వెలుగులోకి వచ్చింది. పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రి వైద్యున్ని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. నిమ్స్ హాస్పిటల్‌లో సీనియర్ రెసిడెంట్‌గా పనిచేస్తున్న ఒక వైద్యుడు తన ఎలక్ట్రిక్ చైర్‌ను సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ OLXలో అమ్మకానికి పెట్టాడు. అది చూసిన సైబర్ నేరగాళ్లు జితేంద్ర శర్మ పేరుతో డాక్టర్‌కు ఫోన్ చేశారు. కాల్ చేసిన వ్యక్తి తనను జితేంద్ర శర్మగా పరిచయం చేసుకొని కూకట్‌పల్లిలో ఫర్నీచర్ షాపు ఉందని, కుర్చీ కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కుర్చీ కొనుగోలు కోసం డబ్బు పంపేందుకు తన క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయాలని సూచించాడు. దీన్ని నమ్మిన వైద్యుడు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగా.. అతని ఖాతా నుంచి రూ.2.58 లక్షలు మాయమయ్యాయి. మోసపోయానని గ్రహించిన వైద్యుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Hyderabad: రామాంతపూర్ లో విషాదం.. షెటిల్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి..
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
తాజాగా జూన్ లో ఈజీ మనీ సంపాదించుకోవచ్చనే ఆశ చూపిస్తూ.. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి దాదాపు రూ.87లక్షలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. హైదరాబాద్ నగరంలోని సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్మాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి ఆన్‌లైన్‌లో రాండీ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తనని తాను ఆస్ట్రేలియా కంపెనీ హైపర్‌వర్త్ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు. తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే.. అతి తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పాడు. అతడి నుంచి కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టించాడు. మొదట్లో లాభాలు ఇస్తూ నమ్మకం కలిగేలా సదరు సైబర్ నేరగాడు.. ఈ క్రమంలో ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెడితే.. ఇంకా ఎక్కువ లాభాలు సంపాదించవచ్చని నమ్మించాడు.. దీంతో ఆ బాధితుడు ఏకంగా రూ.50లక్షలు ఒక్కసారిగా పెట్టుబడి పెట్టాడు. ఇదే సమయంలో మరో బాధితుడికి మయాంక్ అనే వ్యక్తి పరిచయమ్యాడు. ఆ వ్యక్తికి కూడా ఇదే తరహాలో లాభాలను చూపాడు. అతడిని కూడా నమ్మించి.. రూ.12 లక్షలను పెట్టుబడిగా పెట్టించుకున్నాడు. వారు పెట్టుబడి పెట్టిన మరుక్షణం నుంచి ఇటు రాండీ గానీ, అటు మయాంక్ గానీ స్పందించలేదు. దీంతో తాము మోసపోయానని గ్రహించిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Viral Video: స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఆపిన తాగుబోతు… వీడియో చూస్తే నవ్వులే నవ్వులు
తాజావార్తలు
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!