Hyderabad: రామాంతపూర్ లో విషాదం.. షెటిల్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: కరీంనగర్ లో ఫ్రెషర్స్ డే రోజు ఇంటర్ విద్యార్థిని డ్యాన్స్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందిన ఘటన మరువకముందే షెటిల్ ఆడుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన రామంతపూర్ లో చోటుచేసుకుంది. ఉదయం సెటిల్ ఆడుతూ కృష్ణారెడ్డి అనే వ్యక్తి కుప్పకూలిపోయాడు. అయితే అక్కడే వున్న వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే కృష్ణారెడ్డిని పరీక్షించిన వైద్యులు మరణించినట్లు నిర్ధారించారు. కృష్ణారెడ్డికి గుండెపోటు రావడం వల్లే మృతి చెందారని తెలిపారు. షెటిల్ ఆడుతుండగా కృష్ణారెడ్డి ఒక్కసారిగా గుండె కొట్టుకోవడం ఆగి ఉంటుందని అది గమనించకుండా షెటిల్ అలాగే ఆడినందువల్లే మృతి చెంది ఉంటారని వైద్యులు తెలిపారు. అయితే.. ఉదయాన్నే షెటిల్ ఆడటానికి ఇంటి నుంచి బయలు దేరిన వ్యక్తి ఇలా మృత్యువాత పడటం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇంటికి పెద్దదిక్కైన కృష్ణారెడ్డి మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read also: Cyber Crime: తస్మాత్ జాగ్రత్త.. ఆ నంబర్ నుంచి కాల్ వస్తే, అస్సలు లిఫ్ట్ చేయొద్దు
Also Read
- Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
- Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
- Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
- Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
ఆకస్మిక గుండెపోటు మరణాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. చిన్నతనం నుంచి మధ్య వయసు వరకు చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకుని ప్రాణాలు విడిచాడు. మృతుల్లో చిన్నారుల నుంచి మధ్య వయస్కుల వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అప్పటి వరకు తోటి విద్యార్థులతో ఆడుకుంటున్న చిన్నారులు గుండెపోటుకు గురై క్షణాల్లో మృత్యువాత పడ్డారు. వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మారిన ఆహారపు అలవాట్లు, కలుషిత ఆహారం, సమయపాలన లోపం, పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, ఇతర ఆరోగ్య సమస్యలే గుండెపోటుకు ప్రధాన కారణమని పలువురు వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. శారీరక శ్రమ లేకపోవడంతో పాటు రోజువారీ జీవితంలో మానసిక ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యలు, కిడ్నీ సమస్యలు, గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Jailer: కమల్ లైఫ్ టైమ్ రికార్డుకి ఆరు రోజుల్లోనే ఎండ్ కార్డ్…
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!