Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!
- HYD: మహిళా వ్యాపారవేత్త, మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా
- రూ.1.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
- 18 కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్న మహిళా వ్యాపారవేత్త
- ఈనెల 13న ఆమె పేరు, ఫోటోతో అకౌంటెంట్‌కు వాట్సాప్ సందేశం
- మీటింగ్‌లో ఉన్నానని.. చెప్పిన ఖాతాకు రూ.1.20 కోట్లు పంపాలని మెసేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ సరికొత్త ఎత్తుగడలతో రెచ్చిపోతున్నారు. సామాన్యులే కాదు, ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా వీరి మాయలో పడి కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ మహిళా వ్యాపారవేత్త, ఒకప్పటి రాష్ట్ర మాజీ డీజీపీ మనుమరాలిని లక్ష్యంగా చేసుకున్న సైబర్ కేటుగాళ్లు ఏకంగా రూ.1.20 కోట్లు కాజేశారు.
బాధిత మహిళ సుమారు 18 కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 13న ఆమె కంపెనీ అకౌంటెంట్‌కు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. సదరు వ్యాపారవేత్త పేరు , ఆమె ఫోటోతో ఉన్న నంబర్ నుంచి ఆ సందేశం రావడంతో అకౌంటెంట్ అది ఆమె పంపినదే అని నమ్మాడు. “నేను ప్రస్తుతం ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాను, ఫోన్ కాల్స్ ఎత్తలేను.. వెంటనే నేను చెప్పిన ఖాతాకు రూ.1.20 కోట్లు బదిలీ చేయండి” అని ఆ సందేశంలో ఉంది. ఆ ఫోటో, మెసేజ్ చూసి తన యజమాని అని భావించిన అకౌంటెంట్, ఒకే లావాదేవీలో చెప్పిన ఖాతాకు రూ.1.20 కోట్లు పంపించాడు.
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
Kangana : హీరోల వేధింపులకు డైరెక్టర్లు బలి.. బాలీవుడ్ బండారం బయటపెట్టిన కంగనా.
మళ్ళీ ఈ నెల 17న అదే విధంగా మరో సందేశం రావడంతో అకౌంటెంట్ అప్రమత్తమయ్యాడు. ఈసారి భారీ మొత్తం కావడంతో చెక్ అప్రూవల్ కోసం నేరుగా ఆ మహిళా వ్యాపారవేత్తను సంప్రదించాడు. గతంలో పంపిన రూ.1.20 కోట్ల వివరాలను ఆమెకు వివరించాడు. అది విన్న ఆమె ఒక్కసారిగా ఖంగుతిన్నారు. తాను ఎలాంటి డబ్బులు పంపమని మెసేజ్ చేయలేదని చెప్పడంతో, అది సైబర్ నేరగాళ్ల పని అని ఇద్దరికీ అర్థమైంది.
మోసపోయానని గ్రహించిన వెంటనే ఆమె 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. అనంతరం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడు కేరళలో ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని పట్టుకోవడానికి ఇప్పటికే ప్రత్యేక బృందాలు కేరళకు బయలుదేరి వెళ్లాయి. వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోలు చూసి మోసపోవద్దని, భారీ మొత్తంలో నగదు బదిలీ చేసే ముందు సంబంధిత వ్యక్తులతో నేరుగా మాట్లాడి ధృవీకరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
Indian Rupee Falls: ఒక్క రోజులో భారీ పతనం.. రూపాయి పడిపోవడానికి 5 ప్రధాన కారణాలు ఇవే..
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్‌లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!