సైబర్ నేరగాళ్లు ఎంతటి వారినైనా బురిడీ కొట్టించగలరని నిరూపించే మరో చేదు సంఘటన వెలుగులోకి వచ్చింది. అధిక లాభాల ఆశ చూపి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో ఒక మాజీ ఐపీఎస్ అధికారి భార్యను, తద్వారా ఆ అధికారిని మోసగించి ఏకంగా రూ. 2.58 కోట్లు కొల్లగొట్టారు. ఈ మోసం ఒక చిన్న వాట్సాప్ సందేశంతో ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో అద్భుతమైన చిట్కాలు ఇస్తామని, తక్కువ సమయంలోనే ఊహించని లాభాలు గడించవచ్చని బాధితురాలికి సందేశం అందింది.…
Cyber Fraud : హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. చీఫ్ మినిస్టర్ ఓఎస్‌డీ (ప్రత్యేక అధికారి) పేరుతో వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా వల విసురుతున్నారు. ఈ నేరాలపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయబడింది. సీఎం కార్యాలయం పేరుతో వ్యాపార సంస్థల యజమానులకు ఈమెయిల్స్…