Crime : అనుమానం పెనుభూతంగా మారి.. భార్యను హత్యచేసి భర్త ఉరేసుకున్న వైనం
- అనుమానమే పెనుభూతంగా మారి ఘోరం
- భార్యను పొలంలోనే హత్య చేసిన భర్త
- భార్యను చంపిన అనంతరం చెట్టుకు ఉరేసుకున్న వేదనకారి
వాళ్లిద్దరూ భార్యాభర్తలు… పెళ్లైన మొదట్లో అంతా బాగానే ఉంది… తర్వాత అనుమానం రోగం భర్తను వెంటాడింది… పెద్దలు సర్దిచెప్పినా అనుమానం తీరలేదు… చివరకు ఊరు మారితే మనిషి మారతాడనుకున్నాడని భార్య భావించింది… కానీ అనుమానం పెనుభూతంగా మారింది… చివరకు భార్యను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు… దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న వీరి పేర్లు వెంకటేశ్వర్లు, కృష్ణకుమారి. వెంకటేశ్వర్లుది పల్నాడు జిల్లా బొల్లాపల్లి. అదే మండలం మేళ్లవాగుకు చెందిన కృష్ణకుమారికి ఇరవై ఏళ్లక్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. పెళ్లైన మొదట్లో అంతా బాగానే ఉంది. కొన్నాళ్లక్రితం వీరి కాపురంలో విభేదాలు మొదలయ్యాయి. పెద్దలు సర్దిచెప్పడంతో కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది. మళ్లీ తిరిగి గొడవలు మొదలయ్యాయి…
Also Read
- Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
- Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం... పగలు సెగలు..సాయంత్రం జల్లులు
- Rain Effect : అకాల వర్షం.. రైతులు ఆగమాగం..
- Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
భర్త వెంకటేశ్వర్లు వేధింపులు భరించలేని భార్య కృష్ణకుమారి పుట్టింటికి వచ్చింది. మళ్లీ పెద్దమనుషులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. దీంతో వెంకటేశ్వర్లు కూడా మేళ్లవాగు వచ్చి భార్యతో కలిసి ఉండడం మొదలుపెట్టాడు. కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న వెంకటేశ్వర్లు మళ్లీ తన నిజస్వరూపం బయటపెట్టాడు…
వెంకటేశ్వర్లుకు భార్యపై అనుమానం. తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భార్యను నిత్యం వేధించేవాడు. తనకు ఎవరితో వివాహేతర బంధం లేదని ఎంత చెప్పినా భర్త నమ్మలేదు. ఐతే ఊరు మారితే భర్త తీరులో మార్పు వస్తుందని కృష్ణకుమారి ఆశపడింది. కానీ ఆమె ఆశలు అడియాశలే అయ్యాయి. ఊరు మారినా కూడా అదే అనుమానంతో వేధింపులు మొదలుపెట్టాడు. దీంతో భర్త ఏమన్నా పట్టించుకోవడం మానేసింది…
క్రమంగా అనుమానం పెరిగి పెద్దదవడంతో వెంకటేశ్వర్లు రాక్షసుడిలా మారాడు. పక్కా పథకం ప్రకారం భార్యను హత్య చెయ్యాలని డిసైడయ్యాడు. ఎప్పటిలాగానే భార్యతో కలిసి పొలానికి వెళ్లాడు. చుట్టుపక్కల ఎవరూ లేని సమయంలో కత్తితో భార్య కృష్ణకుమారిపై దాడిచేసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. తర్వాత పొలంనుంచి పరారయ్యాడు. సాయంత్రమైనా తల్లితండ్రులు ఇంటికి రాకపోవడంతో ఇద్దరు పిల్లలు ఇరుగు పొరుగుతో కలిసి పొలానికి వెళ్లారు. పొలంలో కృష్ణకుమారి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే కృష్ణకుమారితోపాటు పొలానికి వచ్చిన భర్త వెంకటేశ్వర్లు కనిపించకపోవడంతో అందరూ అతనిపై అనుమానం వ్యక్తం చేశారు. అనుమానంతో భార్యను చంపి పరారై ఉంటాడని భావించారు…
పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. భర్త వెంకటేశ్వర్లు కోసం గాలింపు మొదలుపెట్టారు. అయితే మరుసటిరోజు ఎక్కడైతే కృష్ణకుమారిని హత్య చేశాడో అదే ప్రాంతానికి వచ్చిన వెంకటేశ్వర్లు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలం పనులకు వచ్చిన స్థానికులు వెంకటేశ్వర్లు చెట్టుకు ఉరేసుకుని చనిపోయి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
అనుమానంతో భార్యను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకోవడంతో మేళ్లవాగులో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లితండ్రులు మృతిచెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు…
husband-kills-wife-suicide-due-to-suspicion-palnadu-tragedy
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!