Kothagudem Municipal Corporation : కొత్తగూడెం కార్పొరేషన్ పై ఎర్రజెండా..!
- కొత్తగూడెంలో సీపీఐ ఆధిక్యం
- మెజారిటీ లేక క్యాంపు రాజకీయాలు
- బీఆర్ఎస్ కింగ్‌మేకర్ పాత్ర
- రీకౌంటింగ్‌లతో ఉద్రిక్తత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ వేదికగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకోగా, కొత్తగూడెం కార్పొరేషన్‌లో మాత్రం సీపీఐ (CPI) అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇప్పటికే క్యాంపు రాజకీయాలు వేడెక్కాయి.
మొత్తం 60 డివిజన్లు ఉన్న కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐ మిత్రపక్షాలతో కలిసి 25 స్థానాల్లో విజయం సాధించి ముందంజలో ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ 21 డివిజన్లను కైవసం చేసుకోగా, బీఆర్ఎస్ 9 స్థానాల్లో గెలుపొంది కింగ్ మేకర్‌గా మారింది. బీజేపీ, సీపీఎం తలో స్థానాన్ని గెలుచుకోగా, ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. స్వతంత్రులలో ముగ్గురు ఇప్పటికే సీపీఐకి మద్దతు ప్రకటించే అవకాశం ఉండటంతో ఎర్రజెండా పీఠం ఎక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Also Read
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
IND Playing 11 vs PAK: సంజు, రింకు అవుట్.. సర్ప్రైజ్ ఎంట్రీ, పాకిస్థాన్‌పై ఆడే భారత్ తుది జట్టు ఇదే!
కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవడానికి సీపీఐ , కాంగ్రెస్ పార్టీలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. తమ అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేందుకు సీపీఐ ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. మరోవైపు, బీఆర్ఎస్ గెలిచిన 9 స్థానాలు ఇక్కడ అత్యంత కీలకం కానున్నాయి. కాంగ్రెస్‌తో ఉన్న విభేదాల దృష్ట్యా బీఆర్ఎస్ శ్రేణులు సీపీఐకి మద్దతు ఇచ్చే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. పాల్వంచ మున్సిపాలిటీని కొత్తగూడెంలో విలీనం చేసిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు కావడంతో ఈ విజయం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది.
ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ విజయాలను నమోదు చేసింది. అయితే ఫలితాల వెల్లడి సమయంలో కొన్ని చోట్ల రీకౌంటింగ్ వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి కేవలం 3 ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయిన చోట రీకౌంటింగ్ నిర్వహిస్తూ, తమకు అవకాశం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. వైరా, సత్తుపల్లి, కల్లూరులో కూడా ఇదే తరహా వివాదాలు కొనసాగుతున్నాయి.
Miss India- Miss Universe : టాలీవుడ్ తెరపై మిస్ ఇండియా, మిస్ యూనివర్శ్, మిస్ బ్యూటీఫుల్స్
తాజావార్తలు
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
-
Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!