హైదరాబాద్ లో వరుసగా డ్రగ్స్ అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. వారం రోజుల వ్యవధిలో మూడు అతిపెద్ద కన్సైన్మెంట్ అని అధికారులు పట్టుకున్నారు. తాజాగా 54 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ హైదరాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు సీజ్ చేశారు. ఐదుగురు మహిళల వద్ద నుంచి ఈ డ్రగ్స్ స్వాధీనపర్చుకున్నారు. ఐదుగురు మహిళలు తమ హ్యాండ్ బ్యాగ్ ఏర్పాటు చేసిన సోరగులో డ్రగ్స్ పెట్టుకొని వచ్చారు. ఇవాళ ఉదయం 5 గంటల ప్రాంతంలో దోహా నుంచి ఐదుగురు మహిళలు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. ఈ ఐదుగురు మహిళలు అనుమానాస్పదంగా ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకి వెళ్తున్నారు. దీని పై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు వెంటనే వారిని తనిఖీ చేశారు. ఐదుగురు మహిళలు కూడా తమ హ్యాండ్ బ్యాగ్ రెండేసి పట్టుకొని బయటికి వస్తున్నారు. హ్యాండ్ బ్యాగ్ లను తనిఖీ చేయగా అందులోని రహస్యాలు బయటపడ్డాయి.
వీటిలో ఆరున్నర కిలోల హీరో హెరాయిన్ అధికారులు స్వాధీనపర్చుకున్నారు.. అధికారులు పట్టుకున్న హెరాయిన్ విలువ దాదాపు 54 కోట్ల రూపాయల విలువ ఉంటుందని అధికారులు వెల్లడించారు. గత వారం రోజుల పరిధిలోనే దాదాపుగా 100 కోట్ల పై చిలుకు హెరాయిన్ తో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విరివిగా వస్తున్న డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు హైదరాబాద్ పోలీసులు కసరత్తులు ప్రారంభించారు. ఏడు విచారణ సంస్థలతో కలిసి ఒక ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు చేరుకున్న డ్రగ్స్ ఎక్కడికి వెళుతుందనే విషయాన్ని అధికారులు కనుక్కోలేకపోయారు.
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటపడ్డ వారు నేరుగా స్టార్ హోటల్స్ చేసుకుంటున్నారు. అక్కడ స్టే చేసిన స్మగ్లర్స్‌కి పై నుంచి వచ్చే ఆదేశాలతో ఆయా వ్యక్తులకు డ్రగ్స్ అందజేస్తున్నారు. గత వారం రోజుల పరిధిలో ఎయిర్ పోర్ట్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు. అయితే ఈ డ్రగ్స్‌ని ఎవరికీ చేరవేస్తున్నారు అనే విషయాన్ని వరకు అధికారులు కనుక్కోలేకపోయారు. అయితే దీని ఫైనల్ లబ్ధిదారులు ఎవరనే విషయం కనుక్కునేందుకు హైదరాబాద్ పోలీసులు కసరత్తులు ప్రారంభించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఎన్‌సీబీ, ఈడీ, కస్టమ్స్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, హైదరాబాద్ పోలీస్ ప్రత్యేక బృందాలతో కలిపి ఒక టీమ్ ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు చేరుకున్న డ్రగ్స్ ఎక్కడికి వెళ్తుందనే విషయాన్ని కనుక్కొని వారిపైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.