నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెల్లబంగారం పంట చేతికొచ్చే సమయంలో ఈ ఆకాల వర్షం దెబ్బతీసి రైతులను నష్టాల పాలు చేసింది. ఇరవై రోజులైతే పత్తిపంట చేతికొచ్చేది. అంతలోనే వర్షానికి ఆహుతైంది. దీంతో ఆందోల్ రైతన్నకు చెప్పుకోలేనంత దెబ్బతగిలింది. ఈ ఏడాది వర్షాకాలంలో పత్తి పంట విత్తిన సమయంలో సరిపోను వర్షాలు కురవడం వల్ల రైతులను మురిపించిన పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాల కారణంగా ఆగంచేసింది. నల్ల రేగడి భూముల్లో పంట కాయదశలో ఉండగా చేలుక భూముల్లో పత్తి విప్పింది. మొన్నటి వరకు ఉన్న పత్తి పంటలను చూసి లాభాల బాట పడుతామని అనుకుంటే తమకు తీరని కష్టం వచ్చిందని వాపోతున్నారు రైతన్నలు.
ఈ ఏడాది వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీరుతాయని సంబర పడ్డ రైతులు వర్సాల వల్ల నష్టాల ఉబిలోకి నెట్టేశారు. చేతికొచ్చిన పంటను తీద్దామనుకుంటే అది నల్ల బోయిందని.. ఇది ఎవరు కొంటారని మాకొద్దు మీరే తీసుకెళ్లండి. అంటారేమో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పత్తి పంట నీటిలో మునిగిపోవడం వల్ల పత్తి కాయలు నల్లగా మారిపోయాయి. విప్పిన పత్తి సైతం నల్లబారుతోంది.
Read Also: Crops Loss: అకాలవర్షం. ఆందోల్ పత్తి రైతులకు అపారనష్టం
తెలంగాణ వ్యవసాయ శాఖ చేపట్టిన ఇ- క్రాప్ నమోదు ప్రకారం సంగారెడ్డి జిల్లాలో 3.47 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగుచేశారు. రాయికోడ్ డివిజన్ పరిధిలోని రాయికోడ్ మండలంలో 35.892,మునిపల్లి మండలంలో 33.871, వట్ పల్లి మండలంలో 22.340 వేల ఎకరాలలో పత్తి పంట సాగు చేశారు. మొత్తం డివిజన్ లో 92.106 వేల ఎకరాల్లో పత్తి పంటను సాగుచేశారు. ఈ డివిజన్ లో అధికంగా పంట సాగు చేయడమే కాకుండా అదే తరహాలో పంట నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.
Read Also: UK PM: లిజ్ ట్రస్ పై అవిశ్వాసానికి రంగం సిద్ధం