విశాఖలో టెన్షన్ కొనసాగుతోంది. జనసేనాని పవన్ బస చేసిన నోవాటెల్ హాటల్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మొహారించారు. విశాఖ ఆర్కె బీచ్ మొత్తం పోలీస్ వలయంలో ఉంది. నోవాటెల్ వద్ద కు జనసైనికులు ఎవరూ చేరుకోకుండా పోలీస్ పహారా కొనసాగుతుంది. లా అండ్ అర్డర్ డిసిపి సుమిత్ సహా పోలీస్ ఉన్నతాధికారులు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.జనసేన ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు పవన్… భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.. గవర్నర్‌ని కలిసే అంశాన్ని పరిశీలిస్తోంది జనసేన…పవన్ విజయవాడ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తోంది జనసేన…నేతలతో భేటీ తర్వాత రానుంది క్లారిటీ.