Coronavirus: సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో జిల్లాలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఆందోళణ చెందుతున్నారు. ఈ నాలుగు కేసులలో ఒకరి రికవరి అయినట్టు జిల్లా వైద్యాధికారలు తెలిపారు. దీంతో ప్రస్తుతం సంగారెడ్డిలో మూడు యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో జిల్లాలోని రామచంద్రాపురంలో రెండు, కంది (మం) మామిడిపల్లిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా ఉంది. దీంతో కరోనా సోకిన వారి కాంటాక్ట్ హిస్టరీని అధికారులు పరిశీలిస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్లారు, ఎవరెవరిని కలిశారనేదానిపై ఆరా తీస్తున్నారు. కాగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్‌తో ఆందోళన అవసరం లేదని నిపుణులు చెబుతున్నా.. పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 12 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. మరో 30 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. హైదరాబాద్‌లో 9, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొటి చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,322 కొవిడ్ టెస్టులు చేయడంతో ఈ పాజిటివ్‌గా బయటపడ్డాయి. మరో 38 మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. బాధితుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీడీఎఫ్‌డీ, గాంధీ ఆస్పత్రికి పంపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది.
Also Read
- Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
- Pocharam Srinivas Reddy: "అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా".. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
- Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. "డ్రైవర్‌నే చంపుకోండి" అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
- OTR : కొందరు 'దరిద్రుల' వల్లే పార్టీ మారా!: పోచారం
తాజావార్తలు
-
Anupama Parameswaran: బ్రేకప్ గురించి ఫస్ట్ టైం మాట్లాడిన అనుపమ.. ఆ రిలేషన్షిప్ ఎంతో బాధించిందట!
-
Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
-
Sukhbir Singh Badal: నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై దాడి
-
Bank of America: అంబానీ కంపెనీపై అమెరికా బ్యాంక్ కన్ను.. రూ.18,268 కోట్ల భారీ డీల్!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
ట్రెండింగ్
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!