NTV Telugu Site icon

Kamareddy: రైతులపై బ్యాంకు అధికారుల కఠినత్వం.. రుణం చెల్లించలేదని భూముల వేలం

Kamareddy

Kamareddy

Kamareddy: బ్యాంక్ నుంచి ఎవరైనా లోన్ తీసుకుని తిరిగి కట్టని పక్షంలో అధికారులు వాళ్లకు నోటీసులు జారీ చేస్తారు. ఆ నోటీసులు కూడా తీసుకోకపోతే ఇంటికి వెళ్లి నోటీసును డోర్‌‌కు అంటిస్తారు. అది కూడా లేదంటే నేరుగా లోన్ తీసుకున్న వారికి ఫోన్ చేసి వాకబు చేస్తారు. కానీ, కామారెడ్డి జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రైతుల పట్ల బ్యాంకు అధికారుల తీరు సర్వత్రా వివాదాస్పదం అవుతోంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పంట సాగుకు కోసం డిస్ట్రిక్ కొ-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ సహకార బ్యాంకు నుంచి పలువురు రైతులు గతేడాది రుణాలు తీసుకున్నారు. లోన్ డబ్బులు తిరిగి చెల్లించేందుకు గడువు ముగిసింది. దీంతో రైతులు రుణాలు ఎవరూ డబ్బు కట్టపోవడంతో బ్యాంక్ అధికారులు వినూత్న రీతిలో రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. లింగంపల్లి మండలం, పొల్కంపేట్ గ్రామంలో ఉన్న రైతుల పొలాల్లో ఫ్లెక్సీలు, ఎరుపు రంగు జెండాలను నాటారు.

Read also: Gautham Ghattamaneni: వారసుడు రెడీ అవుతున్నాడు.. వీడియో చూస్తే మైండ్ బ్లాకే..

తీసుకున్న లోన్ అమౌంట్ వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో భూములను వేళం వేస్తామని హెచ్చరించారు. దీంతో గ్రామంలోని రైతులు తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు. పొట్ట నింపే రైతుల భూమిని లాక్కుంటే కుటుంబాన్ని ఎలా పోషించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల కారణంగా పంటలు నేల పాలైందని కన్నీరుమున్నీరుగా విలపించాలరు. ఇప్పుడు అకస్మాత్తుగా డబ్బులు కట్టమంటే ఎక్కడి నుంచి కట్టాలని వాపోతున్నారు. అన్నం పెట్టే రైతన్ననే ఇలా రోడ్డుకు లాగితే.. ఆకలికే అంతులేకుండా పోతుందని అంటున్నారు. భూమినే నమ్మకుని బతుకుతున్నామని ఇప్పుడు ఆ భూమికూడా బ్యాంక్ అధికారులు లాక్కుంటే చిన్నపిల్లలు కుటుంబంతో సహా రోడ్డున పడాలి అంటున్నారు. రుణాలు చెల్లించకపోతే పొలాల్లోకి వచ్చి జెండాలు పెట్టడం ఏంటని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి పోలాలను వేళం వేయకుండా ఆపాలని కోరుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందించనుంది అనేది వేచి చూడాలి.
Maharashtra: మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ పొత్తుకు బీటలు.. మంట పెట్టిన ఆర్ఎస్ఎస్ కథనం..