Kamareddy: బ్యాంక్ నుంచి ఎవరైనా లోన్ తీసుకుని తిరిగి కట్టని పక్షంలో అధికారులు వాళ్లకు నోటీసులు జారీ చేస్తారు. ఆ నోటీసులు కూడా తీసుకోకపోతే ఇంటికి వెళ్లి నోటీసును డోర్‌కు అంటిస్తారు.
High Court: ఏపీ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో జగన్ ప్రభుత్వం ఇటీవల సవరణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అమరావతిలో ఇతరులకు స్థలాలు కేటాయించడంపై కొందరు రైతులు హైకోర్టులో మధ్యంతర దరఖాస్తులు దాఖలు చేశారు. విచారణ పూర్తయ్యే వరకూ భూములు వేరేవారికి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన రైతుల తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు. రైతులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌లపై శుక్రవారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది. కొత్తచట్టంపై రైతుల అభిప్రాయాలు తీసుకుంటున్నామని…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైల్వే శాఖ భూముల వ్యవహారంలో రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. నష్ట పరిహారం ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారంటూ బాధిత కుటుంబం ఆత్మహత్య యత్నం చేసింది. దీంతో పరిస్థితి తీవ్రంగా మారింది. మణుగూరు మండలం రామానుజవరం బీటీపీఎస్ కోసం రైతుల భూముల ను బలవంతంగా పోలీసులను పెట్టి లాక్కుంటున్నారని రైతులు ఆరోపించారు. ఈ సందర్భంగా గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాధితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రెవిన్యూ అధికారులు లేకుండా భూములు స్వాధీనం చేసుకునేందుకు…