Revanth Reddy: గాంధీభవన్‌లో తెలంగాణ స్వాంతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభ మయ్యాయి. జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ ల విగ్రహానికి రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నాల నివాళి అర్పించారు. అనంతరం జాతీయ జెండాను రేవంత్ రెడ్డి ఎగరేసారు. తెలంగాణ గీతంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని కాంగ్రెస్ పాటించింది. జయ జయహే తెలంగాణ పాటను మొదటి సారి రాష్ట్ర గీతంగా కాంగ్రెస్ పాటించింది. రాజులు, నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేసినామన్నారు రేవంత్ రెడ్డి. సాయుధ పోరాటం లో నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. భూమి కోసం…భుక్తి కోసం.. దండు కట్టిందని అన్నారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య. మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు విరోతోచిత పోరాటం చేశారని రేవంత్ పేర్కొన్నారు. ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు తుపాకులు పట్టి తరిమిన చరిత్రమనదని రేవంత్ రెడ్డి అన్నారు. కొందరు చరిత్ర దొంగిలిస్తున్నరని అన్నారు. రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని తెలిపారు.
మతాలు..కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండి పడ్డారు. కాంగ్రెస్ ముక్త భారత్ అనే వాళ్ళు మూర్ఖులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ లోని జునే ఘడ్ లో 1948 లో స్వాతంత్య్రం రాలేదని అన్నారు రేవంత్ రెడ్డి. వల్లభాయ్ పటేల్ హో మంత్రి అయ్యాక.. నిజాం, కాశ్మీర్, ఘునాఘడ్ ల్ను భారత్ లో విలీనం కోసం ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. నెహ్రూ ఆదేశాలతో దేశంలో కలిపారని అన్నారు. గుజరాత్ లో జూనే ఘడ్ కూడా హైదరాబాద్ మాదిరిగానే దేశంలో 1948 లో విలీనం అయ్యిందని అన్నారు. జూన్ ఘడ్ కి స్వాతంత్ర్య ఇప్పించి స్వేచ్ఛ ఇచ్చారు నెహ్రూ అని రేవంత్ పేర్కొన్నారు. మోడీ ఆదేశాలతో హైదరాబాద్ వచ్చారా.. మీకు మీరే వచ్చారా..? ముస్లిం హిందువుల మధ్య చిచ్చే పెట్టే బీజేపీ అని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. గుజరాత్ నుండి కొందరు దేశ దిమ్మరులు హైదబాద్ వచ్చారని అన్నారు. మోడీ ఆదేశాలతో హైదరాబాద్ వచ్చారా.. మీకు మీరే వచ్చారా..? అని రేవంత్ ప్రశ్నించారు.
మోడీ చెప్తే వచ్చేది నిజమని అన్నారు. నిజాం సంస్థానం కూడా దేశంలో విలీనం అవ్వడానికి నెహ్రూ ఆదేశం మేరకు వల్లభాయ్ పటేల్ విలీనం చేశారని అన్నారు. గాంధీ భవన్ పునాదులు వేసిందే వల్లభాయ్ పటేల్ అని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. వల్లభాయ్ పటేల్ మా కాంగ్రెస్ కుటుంబ సభ్యుడనని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నీ నిషేధించింది వల్లభాయి పటేల్ అని తెలిపారు. మీ మూలాలు నిషేధించింది వల్లభాయ్ పటేల్ అని గుర్తు చేశారు. ఆయన విగ్రహానికి దండ వేయడానికి బీజేపీ కి హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. బీజేపీ ప్రజలను విడగొడుతుంది.. మేము ప్రజలను కలుపుతున్నమన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ సొంత చరిత్ర రాయాలని చూస్తున్నారని మండిపడ్డారు. Ts అందులో భాగమే అని విమర్శించారు. కాంగ్రెస్ అధికారం లోకి రాగానే tg గా మర్చేస్తం అన్నారు. అందే శ్రీ గేయం నీ రాష్ట్ర అధికారికి గేయంగా మర్చుతం అన్నారు రేవంత్ రెడడి. కేసీఆర్ సృష్టించిన తెలంగాణ తల్లి దొరల కోసం అన్నారు. సబ్బండ వర్గాల తల్లిగా కాంగ్రెస్ తెలంగాణ తల్లి నమూనా విడుదల చేస్తున్నాం ఇవాళ అని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర జెండా పై సీనియర్ నేతల నుండి సలహాలు వచ్చాయన్నారు. అందరి సలహాలు తీసుకుని జెండా సిద్దం చేస్తామన్నారు.