Jagga Reddy: బీఆర్ఎస్పై జగ్గారెడ్డి సెటైర్లు.. ఆ పార్టీల్లాగే తుస్సుమంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress MLA Jagga Reddy Satires On BRS Party: టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మారడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఎన్నికల కమిషన్‌కు ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా.. అనుమతి లభిస్తుందని బీఆర్ఎస్పై పరోక్షంగా సెటైర్ వేశారు. జాతీయ రాజకీయాల్లో రావాలని టీఆర్ఎస్ వాళ్లు అనుకుంటున్నారని.. అయితే జాతీయ స్థాయిలో రాణించాలనుకున్నా ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇప్పటివరకూ రాణించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు, ములాయం సింగ్ లాంటి వారు జాతీయ పార్టీలు పెట్టి చేతులు కాల్చుకున్నారని.. ఇప్పుడు బీఆర్ఎస్కు కూడా అదే గతి పడుతుందని అభిప్రాయపడ్డారు. జాతీయ పార్టీలు కేవలం రెండు మాత్రమే ఉన్నాయని.. అవి కాంగ్రెస్, బీజేపీ అని తేల్చి చెప్పారు.
ఇక ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోవడానికి కారణం ఎంఐఎం, ఇతర పార్టీలేనని జగ్గారెడ్డి ఆరోపించారు. ఎప్పుడూ హైదరాబాద్ కూడా దాటని ఎంఐఎం పార్టీ.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తోందని మండిపడ్డారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీకి మద్దతుగా ఆమ్ ఆద్మీ, ఎంఐఎం పార్టీలు పోటీ చేస్తున్నాయని ఆరోపణలు చేశారు. గుజరాత్లో బీజేపీ కుట్ర చేస్తోందని, అందుకే అక్కడ గెలుస్తోందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుందని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ గ్రాఫ్ పూర్తిగా తగ్గిందని.. అయితే టిఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌కు రాకుండా బీజేపీకి పోయేలా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధన బలం, మీడియాతో కలిసి కుట్రలు చేస్తున్నారన్నారు. బీజేపీకి తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ వచ్చినా పర్లేదు కానీ.. కాంగ్రెస్ మాత్రం రావొద్దని అన్నట్లుందని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై.. డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు.
Also Read
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్‌కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
అంతకుముందు.. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్లను ఎదుర్కొనే వ్యూహాలపై తాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చర్చిస్తానని జగ్గారెడ్డి తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పరస్పరం దర్యాప్తు సంస్థలతో దాడులు చేసుకోవడం వల్ల.. తెలంగాణలో ఆ రెండు పార్టీలే ఎక్కువ ఫోకస్ అవుతున్నాయన్నారు. జాతీయ స్థాయి నుంచి బీజేపీ ఇస్తున్న సూచనల మేరకు రాష్ట్రంలో పరిస్థితులు నడుచుకుంటున్నాయని.. ఆ రెండు పార్టీలు ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం నుంచి కౌంటర్ స్ట్రేటజీ అవసరమని అన్నారు. కాంగ్రెస్‌లో అనైక్యత అనేది అందరికీ కనిపిస్తోందని, మిగతా పార్టీల్లోనూ విబేధాలుంటాయి కానీ బయటకు రావని చెప్పారు. పార్టీని ఎలా మెరుగుపర్చాలన్న అంశం మీదే తాను దృష్టి పెట్టానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్‌లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!