మెదక్ నియోజకవర్గం లో టీఆర్ఎస్ కి ఏకగ్రీవం కావొద్దనే కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టాము అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే అభ్యర్థిని పెట్టాము. మాకు 230 ఓట్లు ఉన్నాయి. .మేము గెలిచే అవకాశం లేదు. కానీ మా ఓట్లు మేము వేసుకోవాలని అనుకున్నాం. మేము అభ్యర్థి ని ప్రకటించగానే హరీష్ రావు ఉలిక్కి పడ్డారు. క్యాంప్ లు పెట్టాల్సింది మేము… కానీ టీఆర్ఎస్ వాళ్ళు భయంతో క్యాంప్ లు పెట్టారు. అంటే నైతికంగా మేము గెలిచినట్టే అని తెలిపారు. మేము అభ్యర్థి ని పెట్టడం తో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల గౌరవము పెరిగింది. సొంత అల్లుడు, కూతురుని చూసుకున్నట్టు వాళ్ళను చూసుకున్నారు. మా 230తో పాటు 170 ఓట్లు అదనంగా పడొచ్చు. మేము ట్రబుల్ షూటర్ నే ట్రబుల్ లో పడే విధంగా చేశాము అని చెప్పారు.