Site icon NTV Telugu

రైతులతో రెండు ప్రభుత్వాలు ఫుట్ బాల్ ఆడుతున్నాయి: భట్టి విక్రమార్క

యాసంగిలో వరి వేయిద్దనే సీఎం కామెంట్స్ ఆశ్చర్యం కలిగించిందని కాంగ్రెస్‌ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రైతులతో రెండు ప్రభు త్వాలు ఫుట్‌బాల్‌ ఆడుతున్నాయని ఆయన ఆరోపించారు. వరి పంట కొత్తగా పండించడం లేదు. ప్రణాళికలు వేసుకోవడమే ప్రభుత్వ బాధ్య త అన్నారు. నేను కొనను అంటే ఎలా .. కేంద్రం కొనదు కాబట్టి నేను కొనను .. ఏం చేస్తున్నట్టు అని ఆయన ప్రవ్నించారు. బీజేపీ.. టీఆర్‌ ఎస్‌ ఇద్దరూ కలిసి రైతులతో ఆటలాడుతున్నారన్నారు.రైతు పండిం చిన పంట కొనను అనే మాటలు ఎక్కడా వినలేదు. రెండు పార్టీలు రాజకీయాల కోసం రైతులను నాశనం చేస్తున్నాయన్నారు. బండి సంజయ్.. సీఎం అవినీతి తెలుసు అంటారు.. కేసీఆర్..సంజయ్ నేను టచ్ చెయ్ అంటున్నారని ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకమని ఆయన విమర్శించారు.

ప్రజలు వారిని పరిశీలించాలని, ఆలోచన చేయాలని భట్టి అన్నారు. ఏడేళ్ల నుంచి నదీ జలాల వాటా ఇవ్వకపోతే ఇప్పుడు మాట్లాడితే ఏం ప్రయోజనమని కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ అన్నారు. ఏడేళ్ల నుంచి అద్భు తాలు సృష్టిస్తున్నా అన్నావ్‌, కేంద్రం గెజిట్‌ ఇచ్చింది. అసలు ఏం జరుగుతుంది నీటివాటాలో.. కేంద్రం అడిగేది ఒకటి..కేసీఆర్‌ చెప్పేది ఇంకొకటి, అసలు ఎం జరుగుతుంది రాష్ట్రంలోఅని భట్టి విమర్శిం చారు. కేసీఆర్‌ ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. కృష్ణా.. గోదావరి మీద స్పష్టత లేకుండా చేశారు. రాయలసీమ ప్రాజెక్టు పేరు తో ఏపీ నీటి దోపిడీ చేస్తుంది. అది పూర్తియితే సాగర్‌కు నీళ్లు రావు. శ్రీశైలం పై ఆధారపడిన ప్రాజెక్టులు ఎండిపోతాయి ఇరిగేషన్‌పై స్పష్టత లేదు. ఇరిగేషన్‌ సెక్రటరీ వివరాలు కూడా చెప్పడు అంటూ కేసీఆర్‌పై భట్టి ధ్వజమెత్తారు.

Exit mobile version