Jagga Reddy: రానున్న పదేళ్లలో పీసీపీ అవుతా.. సీఎం కూడా అవుతా..
- సోనియా గాంధీ..రాహుల్ గాంధీ గాంధీ భవన్ అటెండర్ పదవి ఇచ్చిన చేస్తా
- అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా
- కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గాంధీ భవన్ అటెండర్ పదవి ఇచ్చిన చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. రానున్న పదేళ్లలో పీసీసీ అవుతానని.. సీఎం కూడా అవుతానన్నారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని.. ఢిల్లీలో కాదన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏది చెప్తే జగ్గారెడ్డి అది ఫాలో అవుతారన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. నేనేం పైరవీలు చేయట్లేదని.. ఎవ్వరు పీసీసీ అయినా పాలన బాగానే ఉంటుందన్నారు.
అధికారంలోనే ఉంటేనే బీజేపీకి పవర్ అని.. పర్మినెంట్ పవర్ కాంగ్రెస్, సోనియాగాంధీ, రాహుల్ గాంధీదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు చరిత్ర ఉందని, బీజేపీకి చరిత్ర లేదన్నారు. మోడీది తాత్కాలిలిక పవర్ అని.. మోడీ ఉన్నంత వరకే బీజేపీ అని.. పవర్ దిగిపోతే మోడీని ఎవ్వరు పట్టించుకోరన్నారు. మళ్ళీ మోడీ పవర్లోకి రారని జగ్గారెడ్డి అన్నారు. యాభై ఏళ్ల కింద ఎమర్జెన్సీ గురించి ప్రస్తావన పార్లమెంట్లో మోడీ, స్పీకర్ తీసుకురావాల్సిన అవసరముందా అంటూ ఆయన ప్రశ్నించారు. మోడీ ఒక్క ఎమర్జెన్సీ గురించి మాట్లాడితే మేము వంద ఎమర్జెన్సీల గురించి మాట్లాడుతామన్నారు. పదేళ్ల మోడీ పాలన రోజూ ఎమర్జెన్సీనే కదా అంటూ విమర్శించారు.
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్‌లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద్రా అల్లర్లు జరిగి 2వేలమంది చనిపోయారని.. మోడీ అధికారంలో ఉన్నప్పుడు పుల్వామా ఘటన జరిగిందన్నారు. పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పార్లమెంట్లో చర్చించే దమ్ము మోడీకి, స్పీకర్ కు ఉందా అంటూ ప్రశ్నలు గుప్పించారు. ఎమర్జెన్సీలో బీజేపీ పార్టీనే లేదన్నారు. ఆరోజు జనతా పార్టీలో ఉన్న వాజ్‌పేయ్ ఇందిరా గాంధీని దుర్గామాతతో పోల్చారన్నారు. పార్లమెంటులో ఎందుకు చర్చించరు, చర్చకు సిద్ధమా అని మోడీని అడుగుతున్నామన్నారు. పల్లె, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండాలని బ్యాంక్‌లను జాతీయం చేసింది ఇందిరా గాంధీ కాదా అంటూ వ్యాఖ్యానించారు. లోక్ సభలో స్పీకర్ ఎందుకు చర్చకు తీసుకురాలేదు అని కాంగ్రెస్ పార్టీ అడుగుతుందన్నారు. చైనా ఆక్రమించిన భారత్ భూభాగాన్ని ఇందిరా గాంధీ యుద్ధం చేసి విడిపించిందన్నారు. పార్లమెంట్లో ఎందుకు చర్చ చేయట్లేదు అని కాంగ్రెస్ ప్రశ్నిస్తుందని.. చర్చకు మోడీ, స్పీకర్ సిద్ధమా అంటూ జగ్గారెడ్డి సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్‌రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!