Site icon NTV Telugu

Revanth Reddy: రైతు కోసం పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధం

Reavanth Reddy

Reavanth Reddy

Revanth Reddy: ప్రభుత్వ యంత్రాంగం, రైస్ మిల్లర్ల మధ్య రైతు నలిగిపోతున్నాడని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తన కష్టాన్ని అమ్ముకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. రైతులకు భరోసా కల్పించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ దాడులు చేస్తూ ఎదురుదాడులతో కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. అందుకే… రైతు కోసం పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తేమ, నాణ్యతను పరిశీలించి అధికారులు కొనుగోలు చేసి తూకం వేస్తున్నారు.

Read also: Prabhas: ఊహించని రేంజ్‎లో సలార్.. హాలీవుడ్ నుంచి స్టంట్ మాస్టర్స్

అయితే మిల్లర్లు ధాన్యాన్ని దించడం లేదని రైతులు వాపోతున్నట్లు సమాచారం. కొందరు మిల్లర్లు ధాన్యం నాణ్యత లేదని, మరికొందరు ధర పేరుతో క్వింటాల్‌కు 3 కిలోలు తగ్గిస్తామంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. వారి షరతులకు అంగీకరిస్తేనే వాహనాల నుంచి కలప బస్తాలను దింపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ జాప్యం వల్ల లారీల యజమానులు రైతుల నుంచి అదనపు అద్దె కూడా వసూలు చేస్తున్నట్లు సమాచారం.

Exit mobile version