ప్రభుత్వ యంత్రాంగం, రైస్ మిల్లర్ల మధ్య రైతు నలిగిపోతున్నాడని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తన కష్టాన్ని అమ్ముకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. రైతులకు భరోసా కల్పించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ దాడులు చేస్తూ ఎదురుదాడులతో కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు.
తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ కేంద్రం నడుస్తోంది. తాజాగా ఢిల్లీలో రైతులకు న్యాయం చేయాలని టీఆర్ఎస్ ధర్నాలు చేస్తుంటే.. హైదరాబాద్ ఇందిరాపార్క్ లో బీజేపీ నేతలు కూడా దీక్షకు దిగారు. దీంతో మాటల యుద్ధం ముదిరిపాకాన పడింది. బీజేపీ మోడీ సర్కారు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు కేంద్రమంత్రి మురళీధరన్. రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కనీస మద్దతు ధరలు పెంచింది. తెలంగాణ రైతులకు కేంద్రం ఏమీ చేయడం లేదని కేసీఆర్ అంటున్నారు. పీయూష్ గోయల్ ధాన్యం…
ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఈమేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రధాని నరేంద్రమోదీ గారికి కేసీఆర్ రాసిన లేఖలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా అనేక అవాస్తవాలు వున్నాయన్నారు. కేసీఆర్ వి అబద్ధాలేనని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గారు ఆధారాలతో సహా తేల్చారు. వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి.. లేనిపక్షంలో కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలి. పంజాబ్ సహా అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రం బియ్యం సేకరిస్తుందే…