Congress: అగ్గి రాజేసిన ఫేస్‌బుక్ పోస్ట్.. మహిళా కాంగ్రెస్ సమావేశంలో రచ్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ మహిళా నేతల మధ్య ఓ ఫేస్‌బుక్ పోస్ట్ చిచ్చు పెట్టింది.. ఓవైపు ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులతో రాష్ట్ర వ్యవహారల ఇంఛార్జ్ ఠాగూర్ సమావేశం నిర్వహిస్తుండగా.. మరోవైపు మహిళా కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది.. రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావును సిటీ అధ్యక్షురాలు కవిత అసభ్య పదజాలంలో దూషించారు.. సునీతా రావును దూషిస్తూ సమావేశం నుండి వెళ్లిపోయారు కవిత.
Read Also: Nizamabad: హనుమాన్ శోభాయాత్రలో బయటపడ్డ బీజేపీ వర్గపోరు..
Also Read
మహిళా కాంగ్రెస్ నేతల సమావేశంలో.. హైదరాబాద్ సిటీ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కవిత, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునితారావు మధ్య వాగ్వాదం.. జరిగింది.. దీనికి కారణం.. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఓ పోటాగా చెబుతున్నారు.. సిద్దిపేట, జోగులాంబ జిల్లాల మహిళా అధ్యక్షురాలు నిలబడి ఉండగా.. సిటీ కాంగ్రెస్ అధ్యక్షురాలు కవిత కూర్చుని ఉన్న ఫోటోలు ఫేస్‌బుక్‌లో షేర్ కావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు సిద్దిపేట, జోగులాంబ జిల్లా మహిళా అధ్యక్షులు.. దీంతో.. సిటీ కాంగ్రెస్ అధ్యక్షురాలు తన ఫేస్ బుక్‌లో ఉన్న ఫోటోలు తొలగించి.. మిగతా నేతలకు సారీ చెప్పాలని కవితకు చెప్పారు సునీతా రావు.. అయితే, మిగతా మహిళా నేతలందరిని అసభ్యంగా దూషిస్తూ సమావేశం నుండి వెళ్లిపోయారు నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు కవిత.. కాంగ్రెస్‌లో ఇలాంటి ఘటనలు సాధారణ వ్యవహారమే అయితే.. ఓవైపు సీనియర్లతో భేటీ జరుగుతోన్న సమయంలో.. ఈ పరిణామం చర్చగా మారింది.
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!