NTV Telugu Site icon

Telangana temperature: తెలంగాణ వాసులు అలర్ట్‌.. ప్రారంభమైన చలి ప్రభావం

Cold Grips Telangana

Cold Grips Telangana

Telangana temperature: తెలంగాణను చలి వణికిస్తోంది..కేరళ రాష్ట్రంలో గత జూన్‌ 1న ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు తెలంగాణ సహా దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక, మరోవైపు రాష్ట్ర ప్రజలను చలి వణికిస్తోంది. దీని ప్రభావం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారి ఇది బంగ్లాదేశ్‌లోని తింకోన, శాండ్విప్‌ మధ్య ఈ నెల 25వ తేదీ ఉదయం తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీని ప్రభావం తెలంగాణపై ఏమీ లేదు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుంది. వర్షాలు పూర్తిగా తగ్గిపోయాయి. శీతాకాలం కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) తన వాతావరణ సూచనలో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో 15 నుండి 19 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత తగ్గుతుందని అంచనా వేసింది.

Read also: Nagababu : ఓహో ఇప్పుడు జనసేన మీద మరోసారి ఎటాక్ చెయ్యటానికి రంగం సిద్ధం

హైదరాబాద్ నగరంలో 16 నుంచి 19 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. గత 24 గంటల్లో సంగారెడ్డిలోని న్యాల్‌కల్‌లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 13.1C నమోదైంది. వికారాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, మెదక్‌లలో 14 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఇరవై నాలుగు గంటల్లో సంగారెడ్డి జిల్లాలోని న్యాకల్‌లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత (13.1C) నమోదైంది మరియు GHMC పరిధిలో రాజేంద్రనగర్ ARS 15 C వద్ద నమోదైంది. అక్టోబరు 22 నుంచి 25 వరకు నగరంలో అసాధారణమైన చలి వాతావరణం కనిపిస్తుందని తెలంగాణ వాతావరణ అధికారి టి. బాలాజీ అక్టోబర్ 20న తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, పొడిగాలులు తెలంగాణలోకి వీయడమే ఇందుకు కారణమని చెప్పారు. ఆదివారం ఉదయం అత్యల్పంగా న్యాల్‌కల్‌(సంగారెడ్డి జిల్లా)లో 13.1, హైదరాబాద్‌లో 16.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెలలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే తొలిసారి. చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.
Anudeep : షారూఖ్‎తో చేయాలని ఉంది.. ‘జాతిరత్నం’ మనసులో మాట