CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఈ నేప థ్యంలో గులాబీ అధినేత కేసీఆర్ సొంత ఇలాఖాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారానికి షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో.. నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం మెదక్ చేరుకోనున్నారు. రాందాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి రేవంత్ ఆ ఊరికి రానున్నారు. ఈ రోజు రాంపూర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. రాష్ట్రానికి సీఎం అయిన తర్వాత రేవంత్ మెదక్ రావడం ఇదే తొలిసారి. దీంతో స్థానిక నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Read also: LSG vs CSK: జడేజా, ధోనీ మెరుపులు వృథా.. కీలక పోరులో లక్నో సూపర్ విక్టరీ..
ఏప్రిల్ 19 నుంచి మే 11 వరకు 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 50 సభలు, ర్యాలీలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. నిన్న(19) మహబూబ్ నగర్ లో పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నవిషయం తెలిసిందే. రేపు 21న భువనగిరిలో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొంటారు, ఎల్లుండి 22న మధ్యాహ్నం ఆదిలాబాద్, 23న నాగర్‌కర్నూల్ బహిరంగ సభలో, 24న ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్‌లో సీఎం రేవంత్ పాల్గొంటారు. చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా ర్యాలీ, సభలో పాల్గొంటారు.
Astrology: ఏప్రిల్ 20, శనివారం దినఫలాలు