CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికల ప్రచారం పార్టీల అగ్రనేతలు ఎంట్రీ ఇచ్చి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూడు నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నేడు కరీంనగర్, వరంగల్, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించానున్నారు. లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల తరపున సీఎం రేవంత్ రెడ్డి ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటనలు నిర్వహిస్తూ కార్నర్ మీటింగ్ లు, జన జాతర సభలకు హాజరవుతున్నారు.
Read also: Karnataka: శ్రీనివాస్ ప్రసాద్ మృతికి సంతాపంగా మంగళవారం సెలవు ప్రకటించిన ప్రభుత్వం
ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. నేడు కరీంనగర్, వరంగల్, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హుజూరాబాద్ జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు బాలాపూర్, బడంగ్ పేట్ కార్నర్ సమావేశంలో పాల్గొంటారు. అనంరం రాత్రి 9 గంటలకు ఆర్కేపురం, సరూర్ నగర్ కార్నర్ సమావేశాలకు సీఎం రేవంత్ హాజరుకానున్నారు. ఇక తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ నిర్వహించనున్న కేంద్ర ఎన్నికల సంఘం.. ఒకే దశలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
Read also: TDP: రెబల్స్‌కు షాకిచ్చిన టీడీపీ..
కాగా మరోవైపు కర్ణాటకలో సేడం ఎన్నికల ప్రచార సభలో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీకి గుజరాత్ అండగా నిలిచినట్లే కర్ణాటక కూడా మల్లికార్జున ఖర్గేకు అండగా నిలవాలని కోరారు. కర్ణాటకలో 25 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలను కర్ణాటక వర్సెస్ గుజరాత్‌గా అభివర్ణించారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు హామీలను అమలు చేసిందని రేవంత్ అన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఆరు హామీల్లో ఐదింటిని ఇప్పటికే అమలు చేసింది. మోడీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Kubera : ఆ కుబేరుడికి ఈ కుబేరకి లింక్.. గెట్ రెడీ..!