తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నాడు.. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అన్నీ సినిమాలు జనాలకు బాగా నచ్చేసాయి.. ఇప్పుడు అదే జోష్ లో కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది..
ఈ సినిమాలో నాగార్జున నటిస్తున్నాడు.. ఆయన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారనే వార్త గత కొన్ని రోజులుగా వినిపిస్తుంది. ఈ సినిమా కోసం అటు నాగార్జున ఫ్యాన్స్, ఇటు ధనుష్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో కూడా శేఖర్ కమ్ముల ఈ సినిమా స్టోరీ గురించి చెప్పాడు.. టైటిల్ కు తగ్గట్లే సినిమా కథ ఉండబోతుందని ఓ క్లారిటీ అయితే వచ్చేసింది…
తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ అప్డేట్ ను వదిలారు.. ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఆ పోస్టర్ లో మే 2న టీజర్ రాబోతుందని మేకర్స్ ప్రకటించారు.. ఆ పోస్టర్ లో డబ్బుల కట్టలు కనిపిస్తున్నాయి.. నాగ్ పోలీస్ గా కనిపిస్తే, మరి ధనుష్ రిచ్ మ్యాన్ గా కనిపిస్తారేమో అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఏది ఏదైన ఈ సస్పెన్స్ తీరాలంటే మాత్రం ఒక్కరోజు వెయిట్ చెయ్యాల్సిందే.. సినిమా కథ గురించి టీజర్ లో చూడవచ్చు.. ఈ సినిమా పై రోజు రోజుకు క్యూరియాసిటి పెరిగిపోతుంది.. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేసే ప్లాన్ లో శేఖర్ కమ్ముల ఉన్నట్లు తెలుస్తుంది..