CM Revanth: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ఈ రోజు ( మంగళవారం ) రాష్ట్ర ఉన్నతాధికారులతో అక్కడే అత్యవసర భేటీ నిర్వహించనున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్, సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇతర కీలక శాఖలకు చెందిన సెక్రటరీలు హస్తినలోనే ఉన్నారు. వీరితో పాటు మిగిలిన సెక్రటరీలు జూమ్ ద్వారా ఈ మీటింగ్ లో పాల్గొననున్నట్టు సమాచారం.
Read Also: Winter Weather: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు.. రానున్న మూడు రోజుల్లో పెరగనున్న చలి తీవ్రత
ఆ తర్వాత ఈ రోజు ( మంగళవారం ) ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ ఎంపీలతో కలిసి తుగ్లక్ రోడ్‌లోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ భేటీలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనుంది. అలాగే, కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు. వీలైతే ఎంపీలతో కలిసి పలువురు కేంద్ర మంత్రులతో కూడా తెలంగాణ సీఎం రేవంత్ సమావేశం అయ్యే ఛాన్స్ ఉంది.
Read Also: Nana Patole: రాజీనామా వార్తలు ఖండించిన మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్
ప్రధానంగా ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలు, సహకారం లాంటి వాటిపై శాఖల వారీగా అప్ డేట్స్ పై ఈ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత సమయం ఉంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలనూ ముఖ్యమంత్రి కలిసే ఛాన్స్ ఉంది. అలాగే, వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీని కలిసి, ప్రత్యేక అభినందనలు తెలుపనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ కు రానున్నారు.