CM Revanth Reddy : కొండా సురేఖ ఎపిసోడ్‌పై రేవంత్ క్లారిటీ.. కీలక వ్యాఖ్యలు..

  • కొండా సురేఖ వ్యవహారంపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
  • క్రమశిక్షణా కమిటీ పరిశీలనలో అంశం
  • పార్టీ అంతర్గత విషయాలపై మాట్లాడను
  • హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి
Konda Surekha 1

Konda Surekha 1

CM Revanth Reddy : లండన్ పర్యటనపై సీఎం రేవంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. అనంతరం ఇటీవల మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించింది. అయితే.. కొండా సురేఖ , ఆమె కుమార్తె ఇటీవలి వ్యాఖ్యల వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ అంశం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ పరిశీలనలో ఉందని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి బహిరంగంగా మాట్లాడనని స్పష్టం చేశారు. పార్టీలో క్రమశిక్షణ అత్యంత కీలకమని, క్రమశిక్షణా కమిటీ దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. హైకమాండ్ , పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా నాయకులంతా క్రమశిక్షణతో కట్టుబడి ఉండాలని సీఎం రేవంత్ సూచించారు.