CM Revanth Reddy : మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వరద పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ వరద ముప్పు ఇంకా పూర్తిగా తగ్గలేదని, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
Bihar High Alert: బిహార్‌లో హై అలర్ట్.. నేపాల్ గుండా భారత్‌లోకి ఉగ్రవాదులు..
ప్రత్యేకంగా వ్యవసాయ రంగంలో జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేసి సమగ్ర నివేదిక అందజేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. రైతులకు తక్షణ ఉపశమన చర్యలు అందేలా చూడాలని ఆయన సూచించారు. అలాగే రవాణా సౌకర్యం దెబ్బతిన్న ప్రాంతాల్లో రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి, సాధారణ రాకపోకలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. వరదల ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ