CM Revanth Reddy: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేడు వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలు, పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలను సీఎం పరిశీలిస్తారు. గురువారం ఉదయమే వరద ప్రభావిత జిల్లాలకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి సిద్ధపడ్డారు. ఆఖరి నిమిషంలో సీఎం పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలించకపోవటంతో హెలికాప్టర్ ప్రయాణం వీలు కాదని ఏరియల్ సర్వేకు అధికారులు అనుమతించలేదు. ఈరోజు వాతావరణం అనుకూలించకపోవటంతో తాను రాలేకపోయానని, శుక్రవారం వరంగల్,…
మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వరద పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.