CM Revanth Reddy: 130 మంది మావోయిస్టుల లొంగుబాటుకు అధికారులు చాలా కృషిచేశారు
- 130 మంది మావోయిస్టుల లొంగుబాటుకు అధికారులు చాలా కృషిచేశారు
- లొంగిపోయిన మావోయిస్టుల ఆర్థిక, ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తున్నాం
- శాంతియుత మార్గాలతోనే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది
- ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలి -సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. దశాబ్దాలుగా అడవిని నమ్ముకుని పోరాటం చేస్తున్న కీలక నేతలు సైతం ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకోవడం రాష్ట్రంలో శాంతి స్థాపనకు కొత్త ఊపిరి పోసింది. ప్లాటూన్-1, TSC, DK SZC, 2nd CRC వంటి ప్రధాన విభాగాలకు చెందిన ఈ మావోయిస్టుల లొంగుబాటు వెనుక పోలీసు ఉన్నతాధికారుల దీర్ఘకాలిక శ్రమ, ప్రభుత్వ పునరావాస విధానాలపై ఉన్న నమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది.
Interest Rates Cut: ఆ బ్యాంక్‌లో లోన్ తీసుకున్న వారికి శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గింపు..
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
ఈ భారీ లొంగుబాటు సందర్భంగా మావోయిస్టులు మొత్తం 124 అత్యాధునిక తుపాకులను వారు పోలీసులకు అప్పగించారు. వీటిలో ఒక INSAS LMG రైఫిల్‌తో పాటు, 31 AK-47లు, 21 INSAS రైఫిళ్లు, 20 SLR రైఫిళ్లు, , 18 .303 రైఫిళ్లు ఉన్నాయి. వీటితో పాటు 5,205 తూటాలు, 9mm పిస్టల్స్ , ఇతర పేలుడు పదార్థాలను కూడా వారు సమర్పించారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, 10 మంది డివిజనల్ కమిటీ సభ్యులతో పాటు 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మావోయిస్టుల లొంగుబాటును సాదరంగా ఆహ్వానించారు. తుపాకీ గొట్టం ద్వారా కాకుండా చర్చల ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. లొంగిపోయిన వారందరి ఆర్థిక , ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పూర్తి హామీ ఇస్తుందని, సొంత గ్రామాల్లో వారు స్థిరపడటానికి ఇళ్ల నిర్మాణంతో పాటు తగిన ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అజ్ఞాతంలో ఉన్న ఇతర మావోయిస్టులు, ముఖ్యంగా కీలక నేత గణపతి వంటి వారు కూడా బయటకు రావాలని, ఆయన ప్రాణాలకు , ఆరోగ్యానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని సీఎం ఒక బహిరంగ పిలుపునిచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనల మేరకు ఆయుధాలతో లొంగిపోయే వారికి అత్యుత్తమ పునరావాసం కల్పిస్తామని, ప్రజాస్వామ్య పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కరించుకుందామని సీఎం స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!