CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా చేర్చేందుకు పీసీసీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ నేతలతో ఫోన్ లో మాట్లాడుతున్న రేవంత్ నేడు రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. సోనియా గాంధీ హాజరుపై ఏఐసీసీ నుంచి ఇప్పటివరకు స్పష్టత రాకపోవడంతో నేరుగా ఢిల్లీ వెళ్లి ఆమెతో మాట్లాడి వ్యక్తిగతంగా ఆహ్వానించాలని భావిస్తున్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా సోనియాగాంధీతో సీఎం రేవంత్ భేటీ కానున్న కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.
Read also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు..
ఈ కార్యక్రమానికి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా పిసిసి ఆహ్వానించింది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్న సందర్భంగా జరిగే ఈ కార్యక్రమానికి సోనియాగాంధీని ఆహ్వానించడం ద్వారా ప్రజల్లోకి స్పష్టమైన సందేశం వెళ్లడంతోపాటు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ హాజరుకావడం పీసీసీకి గౌరవంగా మారింది. జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు, ఆరోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని సోనియా గాంధీ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయం తీసుకుంటారా? లేక ఆమెకు బదులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పంపిస్తారా అన్న ఉత్కంఠ రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో నెలకొంది.
Pune : పూణే పోర్షే ప్రమాదం.. మైనర్ రక్త నమూనాను ట్యాంపర్ చేసిన డాక్టర్లు అరెస్టు