ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలై చర్చించే అవకాశం ఉంది. జాతీయ భద్రతా, వాణిజ్య, వ్యవసాయ రంగాలపై చర్చించనున్నారు.
CWC Meeting: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు CWC సమావేశం కానుంది. ఢిల్లీలోని AICC ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ఈ సమావేశానికి CWC సభ్యులు, శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు, ఉభయ తెలుగు రాష్ట్రాల నేతలు హాజరుకానున్నారు.
CM Revanth Reddy: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా చేర్చేందుకు పీసీసీ ప్రయత్నిస్తోంది.
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ నిర్వహించే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం జాతీయ స్థాయిలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది.
Ponguleti-Jupally: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఢిల్లీకి మారాయి.
తెలంగాణ బీజేపీలో పరిస్థితిని చక్కదిద్దేందుకు బీజేపీ నాయకత్వం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు.