CM Revanth Reddy : CURE పరిధిలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం రేవంత్ సూచనలు
- CURE పరిధిలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం రేవంత్ సూచనలు
- శానిటేషన్, దోమల నివారణపై ప్రత్యేక దృష్టిపెట్టాలి
- మున్సిపల్ సిబ్బంది కేటాయించిన చోటే చెత్త వేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి
- అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. -సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో పాలనను మరింత పారదర్శకంగా, టెక్నాలజీ ఆధారితంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేశారు. అధికారులతో నిర్వహించిన తాజా సమీక్షా సమావేశంలో ఆయన నగర అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం , భద్రతపై విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా హోటళ్లలో ఫుడ్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ప్రతి హోటల్ కిచెన్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, వాటిని నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలని ఆదేశించారు. దీనివల్ల ఆహార తయారీలో నాణ్యతను నిరంతరం పర్యవేక్షించవచ్చని, హోటళ్లకు రేటింగ్ , సర్టిఫికేషన్ ఇచ్చే విధానం ద్వారా వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
Kavitha : ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు నాకు మోరల్ విక్టరీ
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
నగర జీవన ప్రమాణాలను పెంచడంలో భాగంగా శానిటేషన్ , దోమల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారు. మున్సిపల్ అధికారులు సూచించిన ప్రదేశాల్లోనే చెత్త వేసేలా ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా నగరంలోని ప్రతి స్ట్రీట్ లైట్‌కు ఒక ప్రత్యేక నంబర్ కేటాయించి, వాటన్నింటినీ ఒక సెంట్రల్ డ్యాష్ బోర్డుకు కనెక్ట్ చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల ఏదైనా సమస్య తలెత్తినప్పుడు టెక్నాలజీ ద్వారా తక్షణమే పరిష్కారం లభిస్తుందని, ప్రజలకు చీకటి వీధుల భయం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
పర్యావరణ పరిరక్షణ , వర్షపు నీటి నిల్వపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని ప్రధాన సిగ్నల్ జంక్షన్‌లు, సర్కిళ్లలో వర్షపు నీరు వృథా కాకుండా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ (ఇకుడు గుంతలు) ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టును తొలుత కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి, ఆపై నగరం అంతటా విస్తరించాలని అధికారులకు సూచించారు. అలాగే ఫైర్ సేఫ్టీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అత్యున్నత ప్రమాణాలు కలిగిన పరికరాలను వినియోగించాలని ఆదేశించారు. మొత్తం మీద టెక్నాలజీ సహాయంతో సమస్యలను గుర్తించి, క్షేత్రస్థాయిలో వేగంగా పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
US-Iran Tension: “ఇజ్రాయిల్ వదిలి వెళ్లండి”.. ఇరాన్ ఉద్రిక్తతల మధ్య అమెరికా హెచ్చరిక..
తాజావార్తలు
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!