NTV Telugu Site icon

Minister KTR: నేడు సిరిసిల్ల, రేపు సిద్దిపేట.. మంత్రి కేటీఆర్‌ పర్యటన వివరాలు

Minister Ktr

Minister Ktr

Minister KTR: నేడు రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల నియోజక వర్గంలో పర్యటించనున్నారు. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి మండలాల్లో పర్యటించనున్నారు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి ఉదయం 9.30 నుంచి 10.30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సాయిమణి గార్డెన్‌లో జరిగే వివాహ వేడుకలకు బీఆర్‌ఎస్ యువనేత కొర్రి ఎ నీల్‌కుమార్ హాజరుకానున్నారు.

మధ్నాహ్నం 12.30 గంటలకు యువజన నాయకుడు సుధాకర్ ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1 గంటలకు సిరిసిల్లకు చేరుకుంటారు. మున్నూరుకాపు సంఘ కల్యాణమండపంలో జరిగే వివాహ వేడుకలకు టీఆర్‌ఎస్‌వీ నాయకుడు శ్రీనివాస్‌ యాదవ్‌ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు వస్త్ర వర్తక సంఘం భవనంలో వస్త్ర వర్తక సంఘం నూతన కేడర్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించి, 3 గంటలకు తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

Read also: iPhone 15 Launch: యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 15 లాంచ్ డేట్ అప్పుడే! ధర, ఫీచర్ల వివరాలు ఇవే

ఐటీని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించి స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందులో భాగంగా సిద్దిపేట శివారులోని నాగులబండ వద్ద రాజీవ్ రహదారికి ఆనుకుని నిర్మించిన ఐటీ టవర్ ను రేపు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుతో కలిసి ప్రారంభించనున్నారు. జూలైలో నిజామాబాద్ ఐటీ హబ్, ఆగస్టులో నల్గొండ ఐటీ హబ్ ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. సిద్దిపేట జిల్లా కేంద్రం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సమీపంలో ఉంది.

సిద్దిపేట పట్టణ శివారు నాగులబండ వద్ద రాజీవ్ రహదారికి ఆనుకుని ప్రభుత్వం ఐటీ టవర్ నిర్మించింది. ఈ ప్రాంతంలో రోడ్డు కనెక్టివిటీతో పాటు, పోలీస్ కమిషనరేట్ మరియు జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఉన్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు సమీపంలో త్రీ స్టార్ హోటళ్లు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. జీప్లస్ విశాలమైన 3 ఎకరాల స్థలంలో రూ.63 కోట్లతో 4 అంతస్తుల ఐటీ టవర్‌ను నిర్మించింది. ఈ టవర్ నిర్మాణానికి 2020 డిసెంబర్ 10న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా.. అదే రోజు ఐటీ శాఖ కార్యదర్శి పలు కంపెనీలతో ఒప్పందాలపై సంతకాలు చేశారు. గతేడాది నిర్మాణ పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేశారు. ఐటీ టవర్ ఏర్పాటుతో ఈ ప్రాంత యువతకు స్థానికంగా ఐటీ ఉద్యోగాలు రానున్నాయి.
Viral: మండే ఎండలో ఒంటే దాహం తీర్చిన లారీ డ్రైవర్..