Telangana Chief Minister K. Chandrashekar Rao Addressed After Hyderabad Police Command and Control Centre Inauguration.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మానవులు ఉన్నంత కాలం పోలిసింగ్ ఉంటుందని, యావత్తు ప్రభుత్వానికి ఇదొక మూల స్థంభంలా ఉండబోతుందన్నారు. కరోనా కారణంగా భవనం ప్రారంభోత్సవం ఆలస్యం అయ్యిందని, దీని వెనుక ఎంతో మంది పోలీసుల కష్టం ఉందన్నారు. పోలీసులందరికీ సెల్యూట్ చేస్తున్నానని, పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే గమ్యాన్ని చేరుకోవచ్చన్నారు. మొదట 24 ఫ్లోర్స్ అనుకున్నామని.. కానీ కొన్ని కారణాల వల్ల 20 ఫ్లోర్స్ కి కుదించామని కేసీఆర్ తెలిపారు. ప్రపంచ భూతం సైబర్ క్రైమ్ గురించి తాజాగా మహేందర్ రెడ్డి తో మాట్లాడానని, విదేశాల్లో సైబర్ క్రైమ్ పై ఎటువంటి విధానం ఉందో తెలుసుకోమని చెప్పానన్నారు. సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణ కోసం ఒక డీజీ లేదా అడిషనల్ డీజీ స్థాయి అధికారిని పెట్టాలని కోరానని, డ్రగ్స్ మహమ్మారి భవిష్యత్తు తరాల బంగారు భవితను నాశనం చేస్తుందని, డ్రగ్స్ అరికట్టడంలో పోలీసులు ప్రధాన పాత్ర నిర్వహించాలన్నారు. డ్రగ్ ఫ్రీ లో దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ గా తీర్చిదిద్దాలన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి డిసెంబర్ లో రిటైర్ అవుతున్నారని. ఆయన్ను అంత ఈజీ గా వదులుకోమన్నారు.
యూనిఫామ్ లేకపోయినా ఆయన్ను సలహాదారుడిగా సహకారం తీసుకుంటామని, 8 సంవత్సరాల నుండి అశాంతి చెలరేగకుండా అద్భుతంగా పోలీసింగ్ ఉందన్నారు. సింగపూర్ వెళ్ళినప్పుడు నేను స్వయంగా పోలీస్ విధానం ఎలా ఉందో తెలుసుకున్నానని, సింగపూర్ పోలిసింగ్ గురించి టెస్ట్ చేద్దామని అర్ధ రాత్రి ఒక ట్రైల్ వేశామని, ఒక ఐఏఎస్ కూడా మతో వచ్చిందన్నారు. ఎటువంటి ఇబ్బందీ కలగకుండా అమ్మాయి సాఫీగా తిరిగి వచ్చిందని, అమెరికాలోను ఒక్కప్పుడు డ్రగ్స్ విపరీతంగా ఉండేది.. ఇప్పుడు డ్రగ్స్ భూతం అమెరికా లో 90 శాతం తగ్గిందన్నారు. మన దగ్గర కూడా డ్రగ్ అడ్డిక్స్ట్ ను పూర్తిగా నియంత్రించాలని, హైదరాబాద్ లో చాలా వరకు నేరాలు తగ్గు ముఖం పట్టాయన్నారు. పోలీసులకు ఎటువంటి సహకారం కావలన్న ఇస్తామని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పాటు తెలంగాణలో సంస్కార వంతంగా పోలీసింగ్ రావాలన్నారు. కొంత మంది రాజకీయ సన్నాసులు దాన్ని కూడా వక్రీకరించారని, తెలంగాణ పోలీసుల దేశానికే కలికీతురాయిలా ఉండాలన్నారు. జూదం, గుడుంబాను అరికట్టేందుకు తీవ్రంగా కృషి చేయాలని చెప్పామన్నారు. అది పూర్తిగా సక్సెస్ అయ్యిందని, కమాండ్ కంట్రోల్ సపోర్ట్ తో పోలీసులు మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నానన్నారు కేసీఆర్. సీనియర్ అధికారులు , రిటైర్డ్ ఆఫీసర్లు కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించి సలహాలు ఇవ్వాలని కేసీఆర్ కోరారు.