CM KCR: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉదయం ఈ పథకాన్ని ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సీఎం ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. ఈనేపథ్యంలో.. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని మంత్రి హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఒక్కో నియోజకవర్గానికి 119 పాఠశాలల్లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో వైద్య, దేవాదాయ శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ముఖ్యమంత్రి బదులు మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రభుత్వం మానవతా దృక్పథంతో పనిచేస్తుందని హరీశ్ రావు అన్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో చదువుతున్న పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో లాంటి టిఫిన్ తింటారో అలాంటి టిఫిన్ అందిస్తున్నట్లు తెలిపారు. పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలని సీఎం ఆలోచించారు. ఒకటి నుంచి పది వరకు పిల్లలకు ఉదయం అల్పాహారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఏ సంక్షేమం అమలు చేసినా అందులో మానవీయ కోణం ఉంటుందన్నారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా తెలంగాణలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించామని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్ ద్వారా ఆసుపత్రుల్లో 100 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని, తద్వారా మాతా శిశు మరణాలు తగ్గుముఖం పడతాయన్నారు. అల్పాహారం ద్వారా డ్రాపౌట్స్ తగ్గుతాయని, పిల్లల్లో రక్తహీనత తగ్గుతుందని సీఎం చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి వినియోగిస్తామన్నారు. 9, 10 ఏళ్ల పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారని, చాలా రాష్ట్రాల్లో లేనివిధంగా తెలంగాణలోనూ అమలు చేస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ విద్యావ్యవస్థను ఏ రాష్ట్రం పటిష్టం చేయలేదన్నారు. తెలంగాణలో వెయ్యి రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని గుర్తు చేశారు.
దసరా సెలవుల తర్వాత అన్ని పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పథకం అమలును పర్యవేక్షించే బాధ్యతను పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లకు, గ్రామీణ ప్రాంతాల్లో అదనపు కలెక్టర్లకు అప్పగిస్తారు. విద్యాశాఖ, పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తామన్నారు. పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు పథకాన్ని అమలు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలల్లో అల్పాహార పథకం అమలుతో 1 నుంచి 10వ తరగతి వరకు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం, పౌష్టికాహారం అందించడం ద్వారా పిల్లల శారీరక ఎదుగుదల, తల్లిదండ్రులపై భారం తగ్గించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. . ఈ పథకాన్ని పొందుతున్న విద్యార్థుల వివరాలను మొబైల్ యాప్ మరియు ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ ద్వారా సేకరిస్తారు. ప్రతి 15 రోజులకు ఒకసారి అల్పాహారం నాణ్యతను ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు పరిశీలిస్తారని మంత్రి తెలిపారు.
Minister KTR: నేడు వరంగల్ లో కేటీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇలా..