CM KCR: గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సీఎం కేసీఆర్ ఇవాళ భేటీ కానున్నారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఈటల ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఈటల రాజేందర్ ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తన నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారు. మేడ్చల్ జిల్లా అంతాయిపల్లి గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఈరోజు సమావేశం జరగనుంది. గజ్వేల్‌లో నియోజకవర్గ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లుగా మంత్రి హరీశ్‌రావు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిలను ముఖ్యమంత్రి ఇప్పటికే నియమించారు. ఈరోజు జరిగే సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితోపాటు ముఖ్య నేతలు పాల్గొంటారని సమాచారం.
ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బహిరంగ సభల్లో ప్రసంగించాల్సి ఉండడంతో సొంత నియోజకవర్గంలో ప్రచారం చేయలేక పోతున్నారు. అందుకే ఈ సమావేశానికి ఒక్కో గ్రామం నుంచి సుమారు 20 నుంచి 25 మంది కీలక కార్యకర్తలను పిలిపించి ప్రచార బాధ్యతలపై దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. గజ్వేల్‌లో ఈటల రాజేందర్ పోటీ చేస్తారని ప్రకటించిన నేపథ్యంలో గజ్వేల్‌కు చెందిన పలువురు నేతలు ఈటెలతో సంప్రదింపులు జరిపినట్లు తెలియడంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈటల ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారు కావడం, నియోజకవర్గంలో 50 వేలకు పైగా ముదిరాజ్ ఓట్లు ఉండడంతో కేసీఆర్ జాగ్రత్త పడ్డారు. నియోజకవర్గంలో పలువురు ముదిరాజ్ కులస్తులు ఈటెలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకరిద్దరు నేతలు కూడా సమావేశాలు పెట్టి ఎన్నికలకు మద్దతిస్తామని బహిరంగంగానే ప్రకటించారు.
ఈ నేప థ్యంలో ముఖ్య మంత్రి ఈ కీల క కార్య క ర్త ల స మావేశం నిర్వ హించ డం ప్రాధాన్యం సంత రించుకుంది. ముఖ్యమంత్రి 2004 వరకు సిద్దిపేట నుంచి పోటీ చేసి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు, ఆ తర్వాత రెండు దఫాలు ఎంపీగా పోటీ చేశారు. ఆయన సిద్దిపేట నియోజకవర్గం నుంచి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుత మంత్రి హరీశ్ రావును రంగంలోకి దించారు. 2014లో తెలంగాణకు వచ్చిన తర్వాత గజ్వేల్ నుంచి పోటీ చేసి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2018లో కూడా ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈసారి గజ్వేల్‌తో పాటు ముఖ్యమంత్రి కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు.
Dr. Laxman: మధ్యప్రదేశ్, రాజస్థాన్ తో పాటు తెలంగాణ లిస్టు ఫైనల్.. క్లారిటీ ఇచ్చిన లక్ష్మణ్