CM KCR: మొన్నటికంటే ఎక్కువ వరదలొచ్చే ప్రమాదం ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR Meeting On Heavy Rains And Floods In Telangana: తెలంగాణ రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశాలు ఇవ్వడంతోపాటు పరిస్థితులపై ఆరా తీశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి పరీక్షా సమయమని.. కష్టకాలంలో ప్రజలను కాపాడుకోవడం కోసం సంబంధిత శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని, ఎవరూ ఉద్యోగ కేంద్రాలని వదిలి వెళ్లకూడదని సూచించారు. ఈ మేరకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. ఇప్పుడు కురిసే వర్షాలతో గోదావరి నది ఎల్లుండి వరకు ప్రమాద హెచ్చరికలను దాటి ప్రవహించే పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని కేసఆర్ హెచ్చరించారు. కాబట్టి.. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ.. మొన్నటి మాదిరిగానే వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్యశాఖ, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ అండ్ బీ, మున్సిపల్, మిషన్ భగీరథ తదితర శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్.ఐ, సీఐలతోపాటు, పోలీసు సిబ్బందిని హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.
Also Read
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
- Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
- Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
అలాగే.. హైదరాబాద్ నగరంలోని వర్షాలు, వరదలు, చెరువుల పరిస్థితిపై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జలమండలి ఎం.డి. దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తదితరులను అడిగి కేసీఆర్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నీటిపారుదలశాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా గోదావరి ప్రవాహాన్ని, శ్రీరాంసాగర్ నుంచి కడెం వరకు ప్రాజెక్టుల పరిస్థితులను, వరదలు ఎలా వస్తున్నాయనే విషయాలను కేసీఆర్‌కు వివరించారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ వరదలపై ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మొన్నటికంటే ఎక్కువ వరదలొచ్చే ప్రమాదం ఉందన్నారు. మరో మూడు రోజులు భారీ వర్షాలున్నాయని.. నదులు, ఉప నదులు ఉప్పొంగుతున్నాయన్నారు.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!