తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ప్రగతి భవన్ లో కమిటీతో సమావేశం కానున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యాచరణపై కమిటీతో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆగస్టు 8 నుంచి 22 వరకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని, అంటే రెండు వారాల పాటు వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈకార్యక్రమాల రూపకల్పన కోసం రాజ్యసభ సభ్యుడు కేశవరావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీతో సీఎం సమావేశమవుతారు. మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొంటారు.
read also: Ayman al-Zawahiri: అల్‌ఖైదా చీఫ్ హతం.. ధృవీకరించిన అమెరికా అధికారి
అయితే కమిటీ పలుమార్లు సమావేశమైన పక్షం రోజుల పాటు నిర్వహించాల్సిన వివిధ కార్యక్రమాలపై చర్చించి కొన్ని ప్రతి పాదనలు సిద్ధం చేసిన నేపథ్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలు, కార్యాచరణ, విధివిధానాలు, సంబంధిత అంశాలపై కమిటీతో సీఎం కేసీఆర్ నేడు సమావేశం కానున్నారు. ఇవాళ ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ కమిటీతో భేటీ అయి.. కమిటీ ప్రతిపాదించిన అంశాలను పరిశీలించడంతో పాటు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే కార్యక్రామలను ఖరారు చేసి ప్రకటించనున్నారు సీఎం.
ఆరు రోజుల దిల్లీ పర్యటనను ముగించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న (ఆదివారం) హైదరాబాద్ చేరుకున్నారు. అయితే.. దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించిన సీఎం, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తో భేటీ అయి రాజకీయాంశాలపై చర్చించారు. అనంతరం రైతు సంఘాల నేతలు, ఆర్థిక నిపుణులతో పాటు ప్రముఖ జర్నలిస్టులతోనూ ఆయన భేటీ అయిన విషయం తెలిసిందే.
Ambati Rambabu: నా నియోజకవర్గంలో నా బెండు తీయడమా? అలా జరగదు..!!