Command Control Centre: నేడు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నేడు ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట 16నిమిషాలకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా.. 20 అంతస్తులున్న టవర్ ఏ లోని 18 వ అంతస్తులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంటుంది. ఇక్కడ 480 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం, టవర్- డిలో రెండు ఫ్లోర్లు, మీడియా కేంద్రంతో పాటు, ట్రైనింగ్ సెంటర్లు, మొత్తం 12 లిఫ్టులు ఏర్పాటు చేశారు.
కేటీఆర్ ట్విట్:
అయితే.. ప్రపంచస్థాయి సాంకేతికతతో కొలువు దీరిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవంపై ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇది అత్యంత అధునాతన ప్రభుత్వ సదుపాయం భారతదేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్మించి ఉండదని పేర్కొన్నారు. దేశంలో ఈ తరహా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఇదొక్కటే అయ్యి ఉంటుంది’అని బుధవారం తన ట్వీట్‌లో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read
- OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
- Uttam Kumar Reddy: కమిషన్ల కక్కుర్తి వల్లే బ్యారేజీలు కూలాయి.!
- OTR : కాంగ్రెస్ నేతల పొలాల్లో మొలకలు వస్తున్నాయా?
- Telangana Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల..
A truly world class Telangana State Police Integrated Command & Control Centre (TSPICCC) all set to be inaugurated by Hon’ble CM #KCR Garu tomorrow in Hyderabad
Possibly one of the most sophisticated Govt facility built by any Govt in India pic.twitter.com/pO5RkCjClV
— KTR (@KTRTRS) August 3, 2022
రూ. 600 కోట్ల వ్యయంతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ని, సేఫ్ సిటీ ప్రాజెక్టు, కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 9.22 లక్షల సీసీ కెమెరాలను ఈ కేంద్రంతో అనుసంధానిస్తారు. పోలీసులు ఏ క్షణంలో అయినా లక్ష కెమెరాలను పర్యవేక్షించేలా తీర్చిదిద్దారు. క్షేత్ర స్థాయిలో పోలీసింగ్ కు మద్దతుగా తెరవెనక పనిచేసే టెక్నికల్ టీంతో వార్ రూమ్ ఏర్పాటు చేసారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, సోషల్ మీడియా యూనిట్లు కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉండనున్నాయి.
అయితే.. 2016లో నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ… నిధులలేమితో పనులు కొనసాగుతూ వచ్చాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని రహదారులు, భవనాలశాఖ నిధులు మంజూరు చేసింది. ముంబయికి చెందిన నిర్మాణ సంస్థ షాపూర్ జీ-పల్లోంజి ఇంజినీర్లు రేయింబవళ్లు పనులు చేశారు. ప్రస్తుతానికి టవర్-ఏ లో పనులు పూర్తయ్యాయి.
ట్రాఫిక్ ఆంక్షలు
నేడు కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సం కారణంగా హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ సూచనలు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఎన్టీఆర్ భవన్ నుంచి అపోలో ఆస్పత్రి, ఫిల్ద్ నగర్ వైపు వచ్చే ట్రాఫిక్ జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, మాదాపూర్, సైబరాబాద్ వైపు మళ్లింపు, మాసాబ్ ట్యాంక్ నుంచి రోడ్ నెంబర్ 12 వచ్చే వాహనాలను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 క్యాన్సర్ ఆస్పత్రి వైపు మళ్లించనున్నారు. ఫిల్మ్ నగర్ నుంచి వచ్చే ట్రాఫిక్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు, ఎన్టీఆర్ భవన్ వైపు మళ్లించనున్నారు.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!