CM KCR: ఎర్రవల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వేదికగా చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం రెండో రోజూ కొనసాగుతోంది. యాగంలో ఈరోజు ప్రధానంగా రాజశ్యామల యంత్ర పూజ నిర్వహిస్తారు. కేసీఆర్ దంపతులు స్వయంగా ఈ పూజలో పాల్గొంటారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములతో పాటు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ యాగ క్రతువును పర్యవేక్షిస్తున్నారు. యాగశాలలో ఈరోజు రాజశ్యామల అమ్మవారు శివకామ సుందరీ దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. యాగంలో మొత్తం మూడు లక్షలకు మించి రాజశ్యామల మూల మంత్రాలను హవనం చేస్తారు. అలాగే 11 సార్లు శూలినీ దుర్గ కవచ పారాయణ ఉంటుంది. సర్వ లోక సంరక్షణార్ధం ఇంద్ర సూక్త హోమం, నవగ్రహ సూక్త హోమం నిర్వహిస్తారు. షడావరణ సహిత మూల మంత్రాలతో సుబ్రహ్మణ్య కవచ యాగం కూడా నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక యాగం చేపట్టిన విషయం తెలిసిందే.. దీనికి రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం అని పేరు పెట్టారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఈ రాజశ్యామల యాగ దీక్ష బుధవారం విశాఖ శ్రీ శారద అధ్యక్షులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రల ఆధ్వర్యంలో జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన పండితుల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు యాగం జరగనుంది. గోపూజ అనంతరం కేసీఆర్ దంపతులు యాగశాలలోకి అడుగుపెట్టారు. గణపతి పూజ, పుణ్యహవచనం, పంచగవ్య ప్రాసనతో యాగాన్ని ప్రారంభించారు. కేసీఆర్ దంపతులతో స్వరూపానందేంద్ర స్వామి యాగ సంకల్పం అన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం పీఠాధిపతి రాజశ్యామల అమ్మవారికి స్వరూపానందేంద్ర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశ్యామల అమ్మవారిని వనదుర్గ రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతిష్టాత్మకమైన యాగం నిరంతరాయంగా కొనసాగాలని ముక్కోటి దేవతలను ప్రార్థించి అస్త్ర రాజార్చన, కర్కరియా ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ యాగంలో రెండో రోజు వేదపఠనం, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
IND vs SL Dream11 Prediction: భారత్, శ్రీలంక డ్రీమ్11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!