CM KCR: ఎర్రవల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వేదికగా చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం రెండో రోజూ కొనసాగుతోంది. యాగంలో ఈరోజు ప్రధానంగా రాజశ్యామల యంత్ర పూజ నిర్వహిస్తారు.
ఏపీలో ఇటీవల నిర్వహించిన లక్ష్మీ రాజ శ్యామల యాగం చేసిన ఫలితంగా అనుకూల పరిస్థితులు వచ్చాయని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న నిధులు ఇప్పుడే వచ్చాయన్నారు.