Secunderabad: స్వప్నలోక్ ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secunderabad: సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతో పాటు, పలువురు గాయపడడం పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించివారికి 5 లక్షల ఎక్స్ గ్రేషియాను సిఎం కేసీఆర్ ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సిఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో వుండి పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సీఎం కేసీఆర్ సూచించారు.
మరణించినవారికి ₹5 లక్షల ఎక్స్ గ్రేషియాను సీఎం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
— Telangana CMO (@TelanganaCMO) March 17, 2023
Read also: Nizamabad Ragging: తిరుమల విద్యాసంస్థలో ర్యాగింగ్.. పోలీసుల తీరుపై ఆగ్రహం
సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతుల్లో వరంగల్‌కు చెందిన ముగ్గురు, ఇద్దరు మహబూబాబాద్ వాసులు, ఖమ్మంకు చెందిన ఒకరు ఉన్నారు. మృతులు ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి, శివ, ప్రశాంత్‌గా గుర్తించారు. పొగతో ఊపిరాడక ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. ఘటన స్థలాన్ని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ పరిశీలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అగ్నిప్రమాదంలో మరణించిన వ్యక్తులు కాంప్లెక్స్‌లో కార్యాలయం ఉన్న మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. లోపల ఇంకా ఎవరైనా చిక్కుకుపోయారేమోనని రెస్క్యూ సిబ్బంది ఆ ప్రాంతాన్ని గాలిస్తున్నారు.
Read also: Secunderabad: స్వప్నలోక్ ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు 3 లక్షల ఎక్స్ గ్రేషియా..
స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై జీహెచ్‌ఎంసీ, సంబంధిత అధికారులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. సికింద్రాబాద్ ఆర్పీ రోడ్‌లో ఉన్న స్వప్నలోక్ కాంప్లెక్స్ ఎనిమిది అంతస్తుల్లో ఉంది. గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తొలుత ఎనిమిదో అంతస్తులో మొదలైన మంటలు.. తర్వాత 7, 6, 5 అంతస్తులకు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరగడంతో చాలా మంది బయటకు పరుగులు తీశారు. కొందరు మాత్రం బయటకు రాలేక చిక్కుకుపోయారు. దట్టమైన పొగలు అలముకోవడంతో చాలామంది బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది. కాగా, సికింద్రాబాద్‌లోనే వరుసగా అగ్నిప్రమాద ఘటనలు జరగడం గమనార్హం. దక్కన్ మాల్ ఘటనను మర్చిపోకముందే..తాజాగా స్వప్నలోక్ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
Today Business Headlines 17-03-23: ఓలా 2 లక్షల స్కూటర్లు వెనక్కి. మరిన్ని వార్తలు
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!