Hyderabad new Nizam: హైదరాబాద్ నిజాం వారసుడిని ప్రకటించింది చౌమహల్లా ప్యాలెస్. ప్రిన్స్ ముకర్రమ్ ఝా మృతి అనంతరం ఆయన వారసుడిగా మీర్ మహ్మద్ అజ్మత్ అలీఖాన్ అజ్మత్ ఝాను ఎంపిక చేశామని కుటుంబసభ్యులు తెలిపారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, నిజాం టస్ట్రీల మధ్య సంప్రదాయ పద్ధతిలో ఈ ప్రక్రియను నిర్వహించామని చౌమహల్లా ప్యాలెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
Read also: Ariyana Glory: కుండ పట్టుకుని కుర్రాళ్ల కొంపముంచుతున్న అరియానా..
నిజాం చివరి వారసుడు ముకర్రం ఝా మరణానంతరం, అతని కుమారుడు అజ్మత్ ఝా వారసుడిగా ఎంపికయ్యాడు. 1960లో జన్మించిన అజ్మత్ ఝా తన ప్రాథమిక, ఉన్నత విద్యను లండన్‌లో చేశారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి ఫోటోగ్రఫీలో పట్టా పొందారు. హాలీవుడ్‌లో కొన్ని సినిమాలకు ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా చేశారు. హాలీవుడ్ దిగ్గజాలు స్టీవెన్ స్పీల్‌బర్గ్, రిచర్డ్ అటెన్‌బరోలతో కలిసి పనిచేశారు. ఎన్నో లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు తీశారు. తన తండ్రి ముకర్రం ఝా అంత్యక్రియలు పూర్తి కాకుండానే వారం రోజుల కిందటే హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ప్రస్తుతం పాతబస్తీలోని తన పూర్వీకుల నివాసంలో ఉంటున్నారు.
Gold Biscuits: లగేజ్ బ్యాగ్ లో బిస్కెట్లు.. తినేవి కాదండోయ్