Champapet Murder : అన్నదమ్ముల గొడవలో దారుణం.. కత్తెరతో అన్నను చంపిన తమ్ముడు.!
- తండ్రి మరణం తర్వాత పెరిగిన కుటుంబ కలహాలు
- ఆవేశంలో కత్తెరతో అన్నపై దాడి
- ఆస్పత్రికి తరలించేలోపే విషాదం
- పరారీలో తమ్ముడు.. పోలీసుల గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champapet Murder : హైదరాబాద్ నగరంలోని చంపాపేట కుమ్మరి బస్తీలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ తగాదాల కారణంగా కన్న తమ్ముడే కసాయిగా మారి, కత్తెరతో పొడిచి సొంత అన్నను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చంపాపేట కుమ్మరి బస్తీలో నివాసముంటూ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న ముదావత్ వెంకటేష్ (28)కు, పక్క వీధిలోనే నివసిస్తున్న అతడి తమ్ముడు శివ (26)తో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. వీరి తండ్రి మరణించిన నాటి నుంచి అన్నదమ్ముల మధ్య కుటుంబ విషయాల్లో వివాదాలు మరింత తీవ్రస్థాయికి చేరాయి.
కత్తెరతో దాడి.. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు అనంతవాయువుల్లో
ఈ క్రమంలోనే శనివారం అన్నదమ్ముల మధ్య మరోసారి తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఆవేశానికి గురైన తమ్ముడు శివ, ఇంట్లోని కత్తెర తీసుకుని అన్న వెంకటేష్‌పై విచక్షణారహితంగా దాడి చేసి పొడిచేశాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేష్‌ను గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, మార్గమధ్యలోనే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అన్నను పొడిచిన అనంతరం నిందితుడు శివ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు శివ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..