Central Government: చనిపోయిన తొమ్మిదిన్నరేళ్లకు UDID కార్డు.. షాక్లో కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Government: ఎక్కడైనా ప్రభుత్వ వ్యవస్థల పనితీరు కొన్నిసార్లు విమర్శలకు దారి తీస్తుంది. ముఖ్యంగా మనదేశంలో ఏదైనా సరే పని అంత త్వరగా ఏమీ చేయలేమనే విమర్శలు వస్తుంటాయి. పనులను మందకొడిగా జరుతాయని ఏ పని అయినా సులువుగా పరిస్కారం కాదని టాక్ ఉంది. అయితే తాజాగా అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన మర్రి గంగరాజం(70) ఇంటికి పోస్టల్ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక వికలాంగుల గుర్తింపు (యూడీఐడీ) కార్డు వచ్చింది. ఆ కార్డు చూసి గంగరాజం కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. ఇది ఎలా జరగిందని ప్రశ్నలు వేసుకుంటూ ఆశ్చర్యానికి లోలనయ్యారు. ఇది నిజంగానే గంగరాజం కార్డేనా అని అనుమానం వ్యక్తం చేశారు. అయితే చివరకు గంగరాజం యూడీఐడీ కార్డు అని తేలడంతో షాక్ తిన్నారు.
Read also: Russia Ukraine War : ఉక్రెయిన్ రష్యా పోరు.. కనిపించకుండా పోయిన నేపాలీలు
Also Read
అసలు కథ ఇదీ..
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన మర్రి గంగరాజం కుటుంబం నివాసం ఉంటున్నారు. గంగరాజం వికలాంగుడు. అయితే అతని ఇంటికి పోస్టల్ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక యూడీఐడీ కార్డు వచ్చింది. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా? అయితే గంగరాజం చనిపోయి దాదాపు తొమ్మిదిన్నరేళ్లు కావస్తోంది కాబట్టి.. ప్రతి రాష్ట్రం వికలాంగులకు సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. ఈ సర్టిఫికేట్ల ఆధారంగా, యూనివర్సల్ ఐడి, డిసేబిలిటీ సర్టిఫికేట్లను అందించడంలో భాగంగా కేంద్ర మంత్రిత్వ శాఖ యుడిఐడి కార్డును జారీ చేస్తుంది. ఈ కార్డు ద్వారా వికలాంగుల పింఛను, ఇతర సౌకర్యాలు పొందే అవకాశం ఉంది. కానీ గంగరాజం చనిపోయి తొమ్మిదిన్నరేళ్లకే కార్డు ఇంటికి వచ్చింది.
తన తండ్రి 2014లో చనిపోయాడని, అప్పటికి వృద్ధాప్య పింఛను పొందుతున్నాడని కుమారుడు మల్లేశం తెలిపాడు. ఈ కార్డు అప్పుడే వచ్చి ఉంటే వికలాంగుల పింఛన్ వచ్చేదన్నారు. ఈ కార్డు కోసం తన తండ్రి ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నాడో, ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చిందో తెలియడం లేదన్నారు. అది ముందే వచ్చివుంటే ఇప్పుడు గంగరాజం చనిపోయినా పింఛన్ ఇంట్లో ఎవరికో ఒకరికి వచ్చేదని జీవనాధారం పొందేవారని వాపోయారు. ప్రభుత్వ పెద్దల అలసత్వం మరోసారి బట్టబయలైందని మండిపడ్డారు.
CM Revanth Reddy: ముగిసిన రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన.. హైదరాబాద్ రాగానే ప్రెస్ మీట్
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!