TS Assembly Elections: నేడు రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం.. కలెక్టర్లు, ఎస్పీలతో కీలక భేటీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Assembly Elections: తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం మాత్రమే ఉండడంతో కేంద్ర ఎన్నికల సంఘం దూకుడు పెంచింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అందులో భాగంగానే నేడు కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాష్ట్రానికి రానుంది. సీఈసీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. అక్టోబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
2018లో ముందస్తు ఎన్నికలు జరిగినప్పుడు కూడా అక్టోబర్ 6న ఎన్నికల షెడ్యూల్ వచ్చి.. నవంబర్ లో నోటిఫికేషన్ ఇచ్చారు. డిసెంబర్‌లో పోలింగ్ మరియు కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. ఈసారి కూడా ఇంచుమించు అదే షెడ్యూల్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 5-15 మధ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే సీఈసీ అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. తెలంగాణకు రానున్న సీఈసీ బృందం రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశం కానుంది. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించి పలు కీలక సూచనలు చేయనున్నారు. ఈవీఎంల పరిశీలన, ఓటర్ల తుది జాబితా తయారీ, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించనున్నారు. ప్రధాన ఎన్నికల అధికారి కూడా ఈరోజు హైదరాబాద్ వస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల పాటు సీఈసీ బృందం హైదరాబాద్ లోనే మకాం వేసి కలెక్టర్లు, ఎస్పీలు, ఐటీ శాఖ అధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
Also Read
సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం రానున్నట్లు ఈసీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, డబ్బు పంపిణీని అరికట్టడం, ఎన్నికల సమయంలో కొట్లాటలు, దాడులు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై పోలీసు అధికారులతో చర్చించనున్నారు. ఎన్నికల వేళ రాష్ట్రంలోని అన్ని పార్టీలు విజయకేతనం ఎగురవేస్తున్నాయి. ఎన్నికల వ్యూహాలు రచించడంలో స్పీడ్ పెంచారు. అధికారిక BRS కొత్త అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం మరియు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఓడిపోయిన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని శాయశక్తులా ప్రయత్నిస్తోంది. బలమైన నేతలను పార్టీలోకి చేర్చుకోవాలని, సర్వేల ఆధారంగా గెలిచే వారికే టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయించింది. కానుగు సునీల్‌ని ఎన్నికల వ్యూహకర్తగా పెట్టుకుని టీ కాంగ్రెస్ సర్వేలు చేయిస్తోంది.
Revanth Reddy: నేడు పొంగులేటి, జూపల్లితో రేవంత్ రెడ్డి కీలక భేటీ
తాజావార్తలు
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!