యూట్యూబర్, ప్రపంచయాత్రికుడు అన్వేశ్ చిక్కు్ల్లో పడ్డాడు. అన్వేశ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి గల కారణం తెలంగాణ డీజీపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్‌ల ప్రచారం పేరుతో రూ.300 కోట్లు కొట్టేశారంటూ వీడియోలో ఆరోపణలు చేశారు. ఐదుగురు ఐఏఎస్ లతోపాటు డిజిపి 300 కోట్ల రూపాయలు కాజేసారని ఆరోపించాడు. నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు అన్వేష్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read:Rajanna Siricilla: అప్పుల బాధతో మరో నేత కార్మికుడు ఆత్మహత్య..
ఇటీవల అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీల పేర్లను రివీల్ చేస్తూ వీడియోలు చేశాడు. ఆ తర్వాత పలువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పుడు ఏకంగా ఉన్నత స్థాయి అధికారులపై ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అన్వేశ్ చేసిన ఆరోపణల్లో నిజం ఎంత అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక వేళ నిజం అని తేలితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు బాధ్యాతారహితంగా వ్యయవహరించిన అన్వేష్‌పై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.