KTR Twitter: ఆ పరిశ్రమకు కాంగ్రెస్ అండగా నిలవాలి.. కేటీఆర్ విజ్ఞప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Twitter: సిరిసిల్ల గార్మెంట్ పరిశ్రమ సంక్షోభంపై వచ్చిన వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కొన్ని పేపర్ కటింగ్స్ పోస్ట్ చేస్తూ.. పదేళ్లలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన పవర్లూమ్ నాయకులు ఎదగడమే కాకుండా తమ కార్యకలాపాలను కూడా విస్తరించుకున్నారని గుర్తు చేశారు. పదేళ్లలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ ఎస్ ప్రభుత్వం అందించిన సహకారమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. పవర్‌లూమ్ వస్త్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వం ప్రారంభించిన పలు కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఈ పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం సహకరిస్తే తమిళనాడులోని తిరుపూర్ వస్త్ర పరిశ్రమతో సమానంగా పోటీ పడగలమని సిరిసిల్ల నేతన్న అన్నారు. చేనేత రంగానికి సంబంధించి గత 15 రోజులుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించకుంటే పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందన్నారు.
Also Read
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్‌కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- Jagadish Reddy: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
Read also: Supreme Court: శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
The homegrown talented power loom weavers of Siricilla have seen great growth & expansion since the formation of Telangana with the active support of state Government
My request to the Congress Government is to continue and strengthen the sector more as it has the potential to… pic.twitter.com/xmXlQZ4R6u
— KTR (@KTRBRS) January 16, 2024
సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ నేటి నుంచి నిరవధికంగా మూతపడిన విషయం తెలిసిందే.. దేశవ్యాప్తంగా టెక్స్‌టైల్ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం, కొత్త ఆర్డర్లు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గోడౌన్లలో ఇప్పటికే లక్షల మీటర్ల వస్త్రం పేరుకుపోయిందని, పాలిస్టర్ యజమానులు కొత్త నూలు కొనుగోలు చేసి ఉత్పత్తి కొనసాగించే పరిస్థితి లేదని నేతన్నలు వెల్లడించారు. గతంలో ఉత్పత్తి చేసిన వస్త్రాల తాలూకు బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాకపోవడంతో కొత్త పెట్టుబడులు పెట్టలేకపోతున్నారు. పరిశ్రమలో పని లేక కూలీలకు ఉపాధి దొరకడం లేదు. ఈ నేపథ్యంలో వస్త్ర పరిశ్రమ సంక్షోభం పేరుతో పాలిస్టర్ యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయం పరిశ్రమపై ఆధారపడిన పవర్లూమ్ కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు ప్రకటించినప్పటికీ ఉత్తర్వులపై అనిశ్చితి కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని పరిశ్రమల యాజమాన్యాలు తెలిపాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోతే పరిశ్రమలు నడపలేమని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి.
Health Tips : మీరు పింగాణి కప్పుల్లో టీ, కాఫీ తాగుతున్నారా? ఇవి తప్పకుండా తెలుసుకోవాలి..
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..