ఉదయం లేవగానే వేడి వేడిగా టీ, కాఫీ తాగకుంటే చాలామందికి ఏదోలా ఉంటుంది.. అందులో ఇప్పుడు చలికాలం.. ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. అలా పొద్దున్నే టీ, కాఫీ కోసం పరుగేడుతున్నారు.. కాస్త వేడిగా గొంతులోకి దిగితే బాడిలో వేడి పెరుగుతుందని అందరు నమ్ముతారు.. అయితే.. ఒకప్పుడు గ్లాసుల్లో తాగేవారు కానీ ఇప్పుడు మాత్రం గ్లాసుల్లో తాగేవారు.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. అందరు పింగాణి కప్పుల్లో తాగుతున్నారు… ఇలా కప్పులలో తాగడం వలన కొన్ని సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో రకరకాల రంగులతో చాలా ఆకర్షణీయమైన కప్పులు కనిపిస్తూ ఉంటాయి.. వాటిలో వేడిగా ఉండేవి వేసి తాగితే ఆ రంగుల రసాయనాలు శరీరంలోకి వెళతాయి.. దాంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.. అవేంటో ఒకసారి చూద్దాం..
సిరామిక్ పాత్రల తయారీలో తగరం., సీసం వంటివి ఉపయోగిస్తారు.. ఈ కప్పులలో కాఫీ లేదా పాలు తాగినప్పుడు పిల్లలు, బాలింతలు, గర్భిణీలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. అయితే అన్ని పింగాణీ పాత్రలు, కప్పులు హానికరం కాదు..
అయితే ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలకు చెందిన సిరామిక్ కప్పులను వాడితే పెద్దగా దుష్ప్రభావం ఉండదని నాసిరకం కప్పుల్లో సీసం మోతాదుకు మించి ఉంటుందని అందువల్ల హానీ కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. అందుకే ఖరీదైన పర్లేదు.. కానీ ఆరోగ్యం ముఖ్యం కదా..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.