RCB vs MI: స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం అద్భుతం: ఎలీస్ పెర్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ellyse Perry Said I Can’t wait for the WPL 2024 Final: మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 ఫైనల్‌కు వెళ్లినందుకు ఆనందంగా ఉందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ అన్నారు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం అద్భుతం అని, స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేశారని ప్రశంసించారు. డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్ ఆడేందుకు ఎదురుచూస్తున్నా అని పెర్రీ పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు 5 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఫైనల్‌కు వెళ్ళింది.
మ్యాచ్ అనంతరం ఎలీస్ పెర్రీ మాట్లాడుతూ… ‘డబ్ల్యూపీఎల్ ఫైనల్‌లో అవకాశం లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం అద్భుతం. అమ్మాయిలు అందరూ ప్రశాంతంగా ఆడారు. ముఖ్యంగా స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేశారు. మ్యాచ్‌లో అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. అదే మేం చేశాము. గత రెండు మ్యాచ్‌లలో నేను బాగా ఆడినందుకు సంతోషంగా ఉంది. మేము ప్రశాంతంగా ఉన్న విధానం అసాధారణమైనది. గత సీజన్ ఓటమి తర్వాత పుంజుకున్న విధానం బాగుంది. మైదానం, వెలుపల ఒకరినొకరం సహకరించుకున్నాం. పెద్ద గేమ్‌లో పరుగులు చాలా ముఖ్యం. మొత్తానికి ఫైనల్ చేరినందుకు సంతోషం. ఫైనల్ కోసం ఎదురుచూస్తున్నా’ అని అన్నారు.
Also Read
- AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
Also Read: RCB vs MI: ఎలిమినేటర్‌లో ముంబై ఓటమి.. డబ్ల్యూపీఎల్ ఫైనల్‌లోకి బెంగళూరు!
ఎలిమినేటర్ మ్యాచ్‌లో మొదట బెంగళూరు 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ (66; 50 బంతుల్లో 8×4, 1×6) టాప్ స్కోరర్. హేలీ (2/18), నాట్ సీవర్ (2/18), ఇషాక్ (2/27) బెంగళూరును కట్టడి చేశారు. ఛేదనలో ముంబై 130/6కే పరిమితమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ (33; 30 బంతుల్లో 4×4) పోరాడింది. శ్రేయాంక పాటిల్ (2/16), ఆశ (1/13), పెర్రీ (1/29), మోలనూ (1/16) బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో బెంగళూరు తలపడుతుంది.
తాజావార్తలు
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!